“బాహుబలి” మాస్టర్ ప్లాన్ .. ఫస్ట్ లుక్

By Srikanya

హైదరాబాద్ :కామిక్స్ బుక్స్‌లో బొమ్మలతోనే కథ చెబుతారు. ఇవి పిల్లలను, పెద్దలను విశేషంగా అలరిస్తూంటాయి. ముఖ్యంగా పిల్లలు ఈ కామిక్ బుక్స్ కోసం ఎగబడుతూంటారు. అందుకే హాలీవుడ్ చిత్రాల దర్శకులు తమ సినిమాల పబ్లిసిటీకు కామిక్ బుక్స్ ని ఓ సాధనంగా చేసుకుంటూంటారు.

Baahubali comics first look

ఇప్పుడు కామిక్ బుక్ సంస్కృతి మనకీ మెల్లిగా వస్తోంది. ఇన్నాళ్లూ చోటా బీం , డోరె మాన్ లాంటి కామిక్స్ చూసిన మన పిల్లలు ఇప్పుడు "బాహుబలి" కామిక్స్ చూడబోతున్నారు. ఈ మేరకు ఈ కామిక్స్ ఫస్ట్ లుక్ ని వదిలారు. మీరూ ఈ ఫస్ట్ లుక్ ని చూడండి.

అంతేకాదు పిల్లల కోసం "బాహుబలి" వీడియో గేమ్స్ వస్తున్నాయని సమాచారం. కొన్ని కొత్త యాప్స్ కుడా ఈ సినిమాని బేక్ చేసుకుని త్వరలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. వీటికి సైతం సినిమాలాగే మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.

ఇంతకీ ఈ కామిక్స్ వల్ల ప్రత్యేకమైన ఉపయోగం ఏమిటీ అంటే... కామిక్స్ వల్ల డబ్బు రావటమే కాక, బాహుబలి -2 కి కలెక్షన్స్ ఇంకా పెరిగిపోతాయి. అంతే కాకుండా బాహుబలి బ్రాండ్ విలువ పెంచడం వలన ఇంకొక లాభం వుంది. చోటా భీం లాగ బాహుబలి కి కుడా ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేయవచ్చు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన ప్రాతధారులుగా తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఇప్పటికే అనేక కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసిన ‘బాహుబలి' చిత్రం ఈ కామిక్స్ తో మరో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X