»   » ‘బాహుబలి' ని టీవీ సీరిస్ గా ... :రాజమౌళి (క్లైమాక్స్ ట్విస్ట్ గురించి వివరణతో)

‘బాహుబలి' ని టీవీ సీరిస్ గా ... :రాజమౌళి (క్లైమాక్స్ ట్విస్ట్ గురించి వివరణతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా కలెక్షన్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల 23తో విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా మూడో వారంలోకి ఎంటరైంది. ఈ నేపధ్యంలో చిత్రం గురించి రాజమౌళి మాట్లాడారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


రాజమౌళి ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ చివర్లో వచ్చే ఎండ్ సస్పెన్స్ గురించి మాట్లాడుతూ... "ఇది రెండు పార్ట్ లుగా ప్లాన్ చేసిన సినిమా. ప్రాంక్ గా చెప్పాలంటే...నేను బాహుబలిని రాజుగా డిక్లేర్ చేయటంతో ఫస్ట్ పార్ట్ ఎండ్ చేద్దామనుకున్నాను. అయితే ఏదన్నా పొయిటిక్ సస్పెన్స్ తో ఉండే ట్విస్ట్ ఉంటే బాగుంటున్నాను. కానీ అది ప్రేక్షకులకు రౌడ్ షాక్ గా ఉండకూడదనున్నాను ." అని చెప్పారు.


Baahubali Contemplating TV Series

సెకండ్ పార్ట్ గురించి చెప్తూ... "నాకు సెకండ్ పార్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అవటానికి కావాలి. నలభై శాతం బాహుబలి షూటింగ్ ఆల్రెడీ పూర్తి చేసాం ." అన్నారు.


అలాగే ఆయన కంటిన్యూ చేస్తూ..." సెకండ్ పార్ట్ పూర్తవగానే...టీవి సీరిస్ చేయాలనే ఆలోచన ఉంది. మీరు అనుకున్న ధీరి ప్రాక్టికల్ అప్లికేషన్ లో సక్సెస్ అయితే, మీ కాన్ఫిడెన్స్ లెవిల్స్ పెరుగుతాయి. బాహుబలి విజయం నాకు చాలా సంతృప్తి ఇచ్చింది ." అన్నారాయన.


బాహుబలి పార్ట్ 1 విజయవంతం కావడంతో పార్ట్ 2 కోసం భారతీయ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి' పార్ట్ -2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై హీరో ప్రభాస్ స్పష్టత ఇచ్చారు. షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతుందని తెలిపారు.


పార్ట్ 2కు సంబంధించి షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది, యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో సెకండ్ పార్ట్ రాబోతోంది. 2016లో ఈ సినిమా విడుదల కానుంది.

English summary
On ‘Baahubali’ Rajamouli says, “We won’t go beyond the second part as far as cinema is concerned. The story ends with the second part. But we are contemplating a TV series..”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu