»   » 'దేవసేన'...6న వస్తోంది..బి రెడీ:రాజమౌళి

'దేవసేన'...6న వస్తోంది..బి రెడీ:రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తన తాజా చిత్రం బాహుబలికి చెందిన పోస్టర్స్ ని ఒక్కొక్కటి రివిల్ చేస్తూ...చిత్రంపై క్యూరియాసిటీ పెంచుతున్నారు రాజమౌళి. నిన్న చిత్రంలో చిత్రంలో ప్రభాస్ ని శివుడుగా ఆవిష్కరిస్తూ పోస్టర్ వదిలిన రాజమౌళి...మే 6 న అనుష్క కు చెందిన లుక్ ని వదులుతానని చెప్పుకొచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


రాజమౌళి ట్వీట్ చేస్తూ... మీ రెస్పాన్స్ కు చాలా ధాంక్స్. ఇప్పటికే మీకందరికీ అనుష్క..బాహుబలి 2 లో కనపడనుందనే సంగతి తెలిసు. అయితే బాహుబలి ..ది బిగినింగ్ లోనూ ఆమె కొద్ది సేపు చాలా డిఫెరెంట్ లుక్ తో కనపడతుంది. అందుకు సంభందించిన లుక్ ని మే 6 న విడుదల చేస్తాను. దేవసేన గా ఆమె గా ఆమె కనిపించనుంది అన్నారు.ఇక నిన్న విడుదల చేసిన పోస్టర్ విషయానికి వస్తే..


''ఆ గంగను మోసిన జంగమదేవుని నెత్తిన మోసినదెవడు!
నరనరమున సత్తువ ఉరకలు వేసిన నరోత్తముడు ఎవడు!'' -


అంటున్నారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. 'బాహుబలి' కొత్త పోస్టరును సోమవారం సాయంత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో రాసిన వాక్యాలివి. ఇంకా ఆ పాత్ర గురించి వ్యాఖ్యానిస్తూ 'తన హృదయం దేని కోసం తపిస్తుందో దాని కోసం సాగిపోతాడతడు. ఆ ప్రయత్నంలో భూమ్యాకాశాలను సైతం కదిలించగలడు' అనే అర్థంతో ఆంగ్లంలోను, 'భూమి కూడా కళ్లార్పకుండా చూసే వ్యక్తి అతడు! అతణ్ని చూసి కాలం కూడా ఓ క్షణం స్తంభిస్తుంది...' అనే అర్థంతో తమిళంలోను రాసుకొచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాహుబలి' చిత్రంలో


ప్రభాస్‌ బాహుబలిగా, శివుడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శివుడు పాత్రకు సంబంధించిన తొలిరూపు (ఫస్ట్‌ లుక్‌)ను చిత్రబృందం విడుదల చేసింది. జలపాతం నేపథ్యంలో పెద్ద శివలింగాన్ని భుజాన ఎత్తుకొని వస్తున్న శివుడిగా ప్రభాస్‌ ఈ పోస్టరులో కనిపిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగాన్ని 'బాహుబలి - ది బిగినింగ్‌'గా వ్యవహరిస్తున్నారు.


Baahubali: Devasena will be on May 6th

ఈ చిత్రంలో రానా, అనుష్క, తమన్నా ఇతర ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులై 10న విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తారు. తమిళంలో యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్‌, ఎ.ఎ.ఫిల్మ్‌ ద్వారా సినిమా విడుదలవుతుంది.


విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న ఈ చిత్రం కోసం రాజమౌళి బృందం రేయింబవళ్లు కష్టపడుతోంది. 17 వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల్లో 600 మంది సాంకేతిక నిపుణులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారనీ, అయినా అనుకొన్న సమయానికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయామని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు రాజమౌళి. రూ.200 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించారు.


ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో విడుదల కానుంది. ప్రభాస్‌ కూడా ఫేస్‌బుక్‌ ద్వారా 31న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు.


అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ముఖ్యభూమిక పోషించారు. చిత్రంలో రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌, సుదీప్‌, అడివి శేష్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ: వి.విజయేంద్రప్రసాద్‌, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబుసిరిల్‌, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, వీఎఫ్‌ఎక్స్‌: వి.శ్రీనివాస మోహన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


English summary
Rajamouli tweeted :"Thanks again for the awesome response. Most of you might already have known that Anushka is the heroine of Baahubali Part 2.. But in this First part ofBaahubalii - The Beginning, she appears briefly in a completely different avatar… Next Up.. #‎Devasena‬ on 6th May... ‪#‎LiveTheEpic‬"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu