‘బాహుబలి’ సాంగులో బాలయ్య (స్పూఫ్ వీడియో)
హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా విడుదల ముందు నుండే పలు రీమిక్స్ వీడియోలు, స్పూఫ్ వీడియోలు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య బాహుబటి ట్రైలర్ ను అవతార్ సినిమాతో పాటు బాలయ్య లెజెండ్ సినిమా వీడియోలతో రీమిక్స్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ‘బాహుబలి' విడుదలైన తర్వాత కూడా పలు స్ఫూఫ్ వీడియోలు రెడీ అయ్యాయి. ‘బాహుబలి' సినిమాలో ప్రభాస్ జలపాతం ఎక్కే ‘ధీవర' సాంగ్ ను బాలయ్యకు సంబంధించిన సినిమాల వీడియోలతో రీమిక్స్ చేసారు. యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
యూట్యూబ్ లో హడావుడి చేస్తున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
బాహుబలి సినిమా విషయానికొస్తే...
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' రూ. 500 కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ రేంజిలో కలెక్షన్లు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫోర్బ్స్ కథనం ప్రకారం...ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి. హిందీయేతర సినిమాలు రూ 500 మార్కును అందుకున్న దాఖలాలు భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు లేనేలేదు. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, పికె చిత్రాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి.

‘బాహుబలి' తొలి భాగం చూసిన ప్రేక్షకులు.... రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయింది. మిగతా షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుంది. 2016లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











