»   » ‘బాహుబలి’ ఈద్ ముబారక్ పోస్టర్

‘బాహుబలి’ ఈద్ ముబారక్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ బెబుతూ ‘బాహుబలి' టీం ప్రత్యేక పోస్టర్ విడుదల చేసారు. ఇక్కడ ఫోటోల కనిపిస్తున్న బాహుబలి, భళ్లాలదేవ లుక్...... ఇద్దరూకలిసి తమ రాజ్యానికి సంబంధించిన సైనిక రహస్యాలను ఎత్తుకెలుతున్న గూడచారిని పట్టుకునేందుకు వెళ్లిన సందర్భంలోనిది.

Baahubali Eid Poster

ఇక సినిమా విషయానికొస్తే... బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. జులై 10న విడుదలైన ఈ చిత్రం గురువారంతో ఫస్ట్ వీక్ పూర్తయింది. ఈ వారం రోజుల్లో వసూళ్లు ఘనంగా రాబట్టింది. తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఏ సినిమాకు లేనంతగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడంతో పాటు బాలీవుడ్లో నూ దుమ్ము దులుపుతోంది. ప్రపంచ స్థాయిలో బాహుబలికి గుర్తింపు లభించింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి వారం దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.


ఏపీ-తెలంగాణలో టోటల్ ఫస్ట్ వీక్ షేర్ రూ. 61.27 కోట్లు, టోటల్ బాలీవుడ్ ఫస్ట్ వీక్ షేర రూ. 46.77 కోట్లు, కర్నాటకలో రూ. 20 కోట్ల షేర్, ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 35 కోట్ల షేర్ సాధించింది. తెలుగు సినిమా రికార్డులన్నీ తుడిచి పెట్టిన ఈ చిత్రం బాలీవుడ్లోనూ సత్తా చాటింది.

English summary
Check out Baahubali Eid Poster.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu