»   » గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైన ‘బాహుబలి’ (ఫోటో)

గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైన ‘బాహుబలి’ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా కీల‌క‌పాత్ర‌ధారులుగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడమే కాదు, గిన్నిస్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించుకుంది. గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించడంలో భాగంగా ఆ మధ్య భారీ భాముబలి పోస్టర్ తయారు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ..... బాహుబలి భారీ పోస్టర్ రికార్డును నమోదు చేసుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్ సైట్లో కూడా ఇందుకు సంబంధించిన వివరాలను పొందు పరిచింది. బాహుబలి సినిమాను మ‌ల‌యాళ‌ంలో విడుదల చేసిన గ్లోబ‌ల్ యునైటెడ్ మీడియా రూపొందించిన ఈ భారీ పోస్ట‌ర్ ప్ర‌ప‌పంచంలోనే అత్యంత పెద్ద పోస్ట‌ర్‌గా గిన్నిస్ రికార్డు అందుకుంది.

 Baahubali Enters Guinness World Records with Largest poster

మొత్తం 4,793.65 చ‌ద‌ర‌పు మీట‌ర్ల(51,598.21 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఈ పోస్టర్‌ను తయారు చేసారు. ఇప్పటికే బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా...భారీ పోస్టర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా మరింత గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్ సైట్లో బాహుబలి పోస్టర్ వివరాలు చూడొచ్చు.

రూ. 250 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిన ‘బాహుబలి' తొలి భాగం ‘బాహుబలి-ది బిగినింగ్' పేరుతో విడుదలై భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈచిత్రం అన్ని భాషల్లో కలిపి రూ. 300 కోట్ల వసూళ్ల మార్కును అందుకుంది. త్వరలో బాహుబలి పార్ట్-2 షూటింగ్ ప్రారంభం కానుంది. 2016లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
The largest poster has an area of 4,793.65 m² (51,598.21 ft²) and was achieved by Global United Media Company Pvt Ltd (India) in Kochi, India, on 27 June 2015.Baahubali Enters Guinness World Records with Largest poster.
Please Wait while comments are loading...