»   » ‘బాహుబలి-2’ కోసం డబ్బు కట్టలతో క్యూ...!

‘బాహుబలి-2’ కోసం డబ్బు కట్టలతో క్యూ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రా గతేడాది విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సౌత్ లో ఇప్పటి వరకు 'బాహుబలి'ని మించిన సినిమా రాలేదు. ఏ సినిమా కూడా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టలేక పోయింది. విడుదల ముందు 'కబాలి' హైప్ చూసి కొందరు బాహుబలిని బీట్ చేస్తుందనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత 'కబాలి' డీలా పడిన సంగతి తెలిసిందే.

'బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టే సత్తా వచ్చే ఏడాది రాబోయే 'బాహుబలి-2'కు మాత్రమే ఉందని అంటున్నారంతా. సీక్వెల్‌గా వస్తోన్న 'బాహుబలి- ది కంక్లూజన్‌' కూడా చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.


'బాహుబలి' తొలి భాగానికి వచ్చిన స్పందన, కలెక్షన్స్ చూసి చాలా మంది బయ్యలను ఈ సినిమాను కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. డబ్బు కట్టలతో ఇప్పటి నుండే బేరసారాలు జరుపుతున్నారు. ఎలాగైనా ఆ సినిమా హక్కులు దక్కించుకోవాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.


ఓవర్‌సీస్‌లో విడుదల చేసేందుకు ఓ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఏకంగా రూ. 37 కోట్లుతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో ఇది ఒక రికార్డు.


స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..


తమిళహక్కుల కోసం...

తమిళహక్కుల కోసం...


తమిళనాడు హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్‌ రూ.50 కోట్లతో డీల్ ఓకే చేసుకున్నట్లు సమాచారం.


రిలీజ్ ముందే..

రిలీజ్ ముందే..


విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ‘బాహుబలి-2'.. విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


రూ. 1000 కోట్లు

రూ. 1000 కోట్లు


బాహుబలి తొలి భాగం దాదాపు రూ. 650 కోట్ల వరకు వసూలు చేసింది. రెండో భాగం కనీసం రూ. 1000 వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.


చైనాలో..

చైనాలో..


బాహుబల తొలి భాగం ఇటీవల చైనాలో రిలీజైంది. అక్కడ ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది.
English summary
The magnum opus of Indian Cinema, Baahubali-The Beginning has been released in China Market last Friday. Though the film opened on a strictly average note, it is actually the biggest Non-Aamir Khan opener in China. It has slowly improved after receiving good reviews from the Critics. The day 3 witnessed excellent growth and collections are taking a good turn. Till yesterday, the movie has raked $0.63M from China which is 4.23cr in Indian rupees.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu