»   » 'బాహుబలి' కి ఇంకో రికార్డు

'బాహుబలి' కి ఇంకో రికార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహబలి చిత్రం ఇప్పుడు ఇంకో రికార్డుని క్రియేట్ చేసింది. కలెక్షన్ల విషయంలో రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్న బాహుబలి.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మరో రికార్డు సృష్టించింది. ఆ రికార్డుని ఇక్కడ చూడండి.

Our Facebook page has crossed 2 Million fans. Thank you so much and keep the love coming!! #Baahubali #LiveTheEpic


Posted by Baahubali on 19 August 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మొదటనుంచి తమ సినిమా ప్రచారానికి సోషల్ మీడియాని నిర్మాతలు విస్తృతంగా వాడుకున్నారు. ఈ సినిమా ప్రచారం కోసం అధికారికంగా ఒక ట్విట్టర్ ఖాతాను, ఫేస్ బుక్ పేజీని తెరిచారు. అందులో ఫేస్ బుక్ పేజీకి 20 లక్షల మంది అభిమానులు చేరారు.


అంటే, ఈ పేజీని ఇప్పటికి 20 లక్షల మందికి పైగా లైక్ చేశారన్న మాట. వాళ్లందరికీ ఈ పేజీలో పెట్టిన విషయాలు, విశేషాలు ఈ లైక్ చేసినవారందికీ వెళ్తాయి. ఈ విషయాన్ని బాహుబలి ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. అలాగే బాహుబలి ట్విట్టర్ ఖాతాను కూడా ఇప్పటికి 1.31 లక్షల మంది వరకు ఫాలో అవుతున్నారు.


Baahubali Facebook page has crossed 2 Million fans

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Rajamouli's Facebook page has crossed 2 Million fans.
Please Wait while comments are loading...