»   » ‘బాహుబలి’ అక్కడ దారుణమైన ప్లాప్, నష్టం ఎంత?

‘బాహుబలి’ అక్కడ దారుణమైన ప్లాప్, నష్టం ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారత్‌లో ఇప్పటి వరకు వచ్చిన గ్రేట్ సినిమాలు ఏవి అనే లిస్టు తయారు చేస్తే టాప్ లిస్టులో 'బాహుబలి' చిత్రానికి కూడా చోటు దక్కుతుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ గతేడాది విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఇండియన్ ప్రక్షకులు ఈ చిత్రానికి నీరాజనాలు పట్టడంతో....విదేశాల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు నిర్మాతలు.

ఇందుకోసం సినిమాను హాలీవుడ్ స్టాండర్ట్స్‌కు తగిన విధంగా నిపుణులతో ఎడిటింగ్ చేయించారు. ఆయా దేశాల్లో ఇంగ్లీషుతో పాటు ఆయా దేశాల బాషల్లో అనువాదం చేయించారు. కొన్ని దేశాల్లో ఈచిత్రానికి మంచి స్పందనే వచ్చినా.... జర్మనీలో మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది.


ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని జన్మనీలో 30 స్క్రీన్లలో రిలీజ్ చేసారు. ఇక్కడ ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనాలు పెట్టుకున్న నిర్మాతలకు తీవ్ర నిరాశే ఎదురైంది. తొలి వారాంతం ఈ చిత్రం ఇక్కడ కేవలం 4,166 యూరోలు(రూ. 3.17 లక్షలు) మాత్రమే వసూలు చేసింది.


Baahubali failed at German box office

ఇండియన్ బాక్సాఫీసుతో పాటు చాలా దేశాల్లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు రావడంతో రావడంతో జన్మనీలో అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రానికి భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్నారు. అయితే ఫలితం ఇంత దారుణంగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్ నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.


'బాహుబలి'తో పాటు బాలీవుడ్ మూవీ 'బాజీ రావు మస్తానీ' మూవీ కూడా జర్మనీలో నష్టాలనే మిగిల్చింది. ఇటీవల కాలంలో జర్మనీలో మంచి విజయం సాధించిన చిత్రం ఇర్ఫాన్ ఖాన్ నటించిన అవార్డ్ విన్నింగ్ చిత్రం 'లంచ్ బాక్స్' మాత్రమే. ఈ చిత్రం ఇక్కడ రూ. 11.29 కోట్లు వసూలు చేసింది.

English summary
Indian blockbuster Baahubali: The Beginning has been released in Germany and the Deutsch dubbed version is titled ‘Ich Bin Baahubali’. The film has collected €4,166 i.e Rs. 3.17 lakh during the first weekend at the German box office, which is a huge disappointment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu