బాహుబలి ఫ్యాన్స్ టాక్ ఎలా ఉంది.... (వీడియో)
హైదరాబాద్: గత రెండేళ్లుగా కళ్లలో వొత్తులేసుకుని ఎదురు చూస్తున్న ప్రభాస్, రాజమౌళి అభిమానుల కల నేటికి సాకారమైంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా నేడు గ్రాండ్ గా విడుదలైంది. వీరాభిమానులంతా అర్ధరాత్రి నుండే మొదలై బెనిఫిట్ షో టికెట్లు వేల రూపాయలకు కొనుగోలు చేసి మరీ వెళ్లారు.

అందరి కంటే ముందు తమ అభిమాన హీరో సినిమా చూసామనే ఆనందంలో థియేటర్లో సందడి చేసారు. జై మహిష్మతి, జై ప్రభాస్ అంటూ నినాదాలు చేసారు. సినిమా అద్భుతంగా ఉందని, తెలుగు సినిమా చరిత్రలో ‘బాహుబలి' నెం.1 సినిమా అవుతుందని, గత రికార్డలన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొడుతుందంటూ ఆనందం వ్యక్తం చేసారు.
బాహుబలి సినిమాపై అభిమానుల టాక్ ఎలా ఉందో ఈ వీడియోలో వీక్షించడి.


Click it and Unblock the Notifications











