యూఎస్‌ను వదలని బాహుబలి ఫీవర్.. ఫుట్‌బాల్ కోర్టులో సాహోరే బాహుబలి.. వీడియో వైరల్!
బాహుబలి2 సినిమా రిలీజై ఏడు నెలలు గడిచినా గానీ ఇంకా ఆ మధురస్మృతులు మది నుంచి తొలగిపోవడం లేదు. బాహుబలి చిత్రం కేవలం తెలుగు వాళ్లనే కాదు.. దేశంలోని సినీ ప్రేక్షకులందరినీ మొత్తాన్ని ఉర్రూతలూగించింది. అయితే తాజాగా అమెరికావాసులను కూడా బాహుబలి ఫీవర్ వదల్లేదనే విషయం తాజాగా ఓ సంఘటన రుజువు చేసింది. అమెరికాలో ప్రజాదరణ పొందిన ఎన్‌బీఏ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా బాహుబలి సినిమాలోని పాటకు నృత్యాలు చేయడం నెటిజన్లను ఆకట్టుకొంటున్నది. ఆ వీడియో మీరే చూడండి..

అమెరికాలో బాహుబలి ఫీవర్
ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా ఓర్లాండ్‌లోని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) మ్యాచ్‌లను నిర్వహించింది. క్రీడాకారులను, క్రీడాభిమానులను ఉత్తేజపరుచడానికి బాహుబలి2లోని సాహోరే బాహుబలి అనే పాటకు కొందరు కళాకారులు డ్యాన్స్ చేశారు. దాంతో ఆడిటోరియం అంతా సందడిగా మారింది.
ఎన్‌బీఏ కోర్టులో బాహుబలి
సాహోరే బాహుబలి పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను ఎన్‌బీఏ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి షేర్ చేసింది. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దాదాపు ఆ వీడియోను దాదాపు 10 లక్షల మంది ఇప్పటివరకు వీక్షించారు. ఓర్లాండో అభిమానులు దేశీ పాటకు చిత్తయిపోయారు అని రాసి వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం.

యూఎస్‌లో బాహుబలి 100 కోట్లు
ఇదిలా ఉండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో భాషాభేదం లేకుండా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం అమెరికాలో రూ.100 కోట్లు వసూలు చేసి నాన్ హాలీవుడ్ క్యాటగిరిలో దుమ్ము రేపింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే ప్రశ్న ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా వెంటాడింది.

బాహుబలి 1000 కోట్లు
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి2 చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్కశెట్టి, రమ్యకృష్ణ, తమన్నా తదితరులు నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరుగరాస్తూ రూ.1000 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











