twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇద్దరి వల్లే ప్లాప్: ఒత్తిడిలో బాహుబలి టీం, పార్ట్-2 రిలీజ్ ఇంకా లేటు..!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన విజువల్ వండర్ 'బాహుబలి' తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర ఇండియన్ బాషల్లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది.

    ఈ విజయం రాజమౌళి అండ్ టీంలో కొత్త ఉత్సాహాన్ని నింపించింది. సినిమాను కేవలం ఇండియాకే పరిమితం చేయకుండా వివిధ దేశాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేసారు. ఇందుకోసం హాలీవుడ్ సినిమాలకు పని చేసిన నిపుణులను పిలిపించి ప్రపంచ స్థాయికి తగ్గట్లు సినిమాను ఎడిట్ చేయించారు.

    ఇతర దేశాల్లో సినిమా రిలీజ్ చేయడం ద్వారా సినిమాకు మరిన్ని లాభాలు వస్తాయని ఆశించిన నిర్మాతల అంచనాలు పూర్తిగా తారు మారయ్యాయి. ఆ మధ్య యూరఫ్ లో సినిమాను రిలీజ్ చేయగా నష్టాలే మిగిలాయి.

    తర్వాత చైనా మార్కెట్ మీద భారీ అంచనాలు పెట్టుకున్న రాజమౌళి అండ్ టీం ఇక్కడ సినిమాను గతంలో ఏ ఇండియన్ మూవీ కూడా రిలీజ్ కానన్ని థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ చేసారు. ప్రధాన తారాగణం అంతా చైనా వెళ్లి ప్రమోషన్స్ నిర్వహించారు.

    గతంలో చైనాలో పికె రిలీజ్ అయి దాదాపు 19 మిలియ్ డాలర్లు(రూ. 120 కోట్లు) వసూలు చేసింది. ఈ రికార్డును బాహుబలి తిరగరాస్తుందని భావించారు. అయితే అంచనాలు తారుమారయ్యాయి. 19 మిలియన్ డాలర్ల టార్గెట్ పెట్టుకున్న బాహుబలి కనీసం 1 మిలియన్ డాలర్ కూడా దాటలేక పోయింది.

    చైనాలో బాహుబలి సినిమా ప్లాప్ కావడానికి ఇద్దరే ఇద్దరూ ప్రధాన కారకులయ్యారు. వారికి సంబంధించిన విశేషాలు, బాహుబలి చైనాలో ఎంత వసూలు చేసింది, ఇతర ఇండియన్ సినిమాల వసూళ్లు ఎంత తదితర విషయాలు స్లైడ్ షోలో...

    బాహుబలి వసూలు చేసింది ఎంతంటే?

    బాహుబలి వసూలు చేసింది ఎంతంటే?

    ఆగస్ట్ 22న బాహుబలి చైనాలోను రిలీజ్ అయింది. ఇక్కడ ఈ సినిమా కేవలం 7.5 లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయి. అంటే 1 మిలియన్ మార్కును కూడా అందుకోలేక పోయింది.

    ఆ ఇద్దరే కారణం

    ఆ ఇద్దరే కారణం

    చైనా సినీ స్టార్లు జాకీ చాన్, జెట్ లీలు బాహబలికి ఇంత భారీ నష్టానికి ప్రధాన కారణం అని అంటున్నారు.

    తట్టుకోలేక

    తట్టుకోలేక

    చైనాలో బాహుబలి రిలీజ్ అయిన రోజునే జెట్ లీ నటించిన 'లీగ్' తో పాటు జాకీచాన్ మూవీ 'స్కిప్ ట్రేస్' కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాలు భారీ సక్సెస్ సాధించడంతో బాహుబలి సినిమా వైపు చూసే వాళ్లే కరువయ్యారు.

    చైనాలో ఇలాంటివి..

    చైనాలో ఇలాంటివి..

    మనకంటే బాహుబలి లాంటి వార్ సినిమాలు కొత్తగానీ చైనాలో ఇలాంటి సినిమాలు బోలెడు వచ్చాయి. అందుకే వారికి బాహుబలి పెద్దగా నచ్చలేదని టాక్.

    ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలు

    ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలు

    ఇప్పటి వరకు చైనాలో పికె మూవీ అత్యధికంగా 19.4 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, ధూమ్ 3 మూవీ 3 మిలియన్, 3 ఇడియట్స్ 2.2 మిలియన్, హ్యాపీ న్యూఇయర్ 5 లక్షల డాలర్లు, మైనేమ్ ఈజ్ ఖాన్ 71వేల డాలర్లు వసూలు చేసింది.

    బాహుబలి టీంలో ఒత్తిడి

    బాహుబలి టీంలో ఒత్తిడి

    చైనాలో కూడా బాహుబలి ప్లాప్ కావడంతో బాహుబలి టీంలో ఒత్తిడి పెరిగింది. పార్ట్ 1 ప్లాప్ ఎఫెక్ట్ పార్ట్ 2 పై పడుతుందని... రేపు పార్ట్ 2కు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర పలికే అవకాశం లేదనే ఆందోళనలో ఉన్నారట.

    మరింత ఆలస్యం

    మరింత ఆలస్యం

    ప్రస్తుతం రాజమౌళి ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్ కు తగిన విధంగా మార్పులు చేసే అవాకాశం ఉందని, అలా చేస్తే రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

    English summary
    Baahubali – The Beginning, has been rejected by the audiences in China also. The film’s release in 2015 was phenomenal. It went on to become the highest grossing Indian films of all time making Telugu cinema stand high up on the cinema history of India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X