»   » గూగుల్ లోనూ దంచేసిన 'బాహుబలి'

గూగుల్ లోనూ దంచేసిన 'బాహుబలి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాహుబలి తన ప్రతాపం మరో సారి చూపించింది. సల్మాన్ ఖాన్ ..భాయీ భజరంగి, ప్రేమ్ రతన్ ధన్ పాయోలను దాటి నెంబర్ వన్ మూవీగా నిలిచింది.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో విడుదలైన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరోక గౌరవం సంపాదించుకుందీచిత్రం...అదేమిటంటే గూగుల్‌ ఇండియా నెం.1 మూవీగా బాహుబలి ప్రథమ స్థానంలో నిలిచింది.


బాహుబలి ప్రథమ స్థానంలో నిలవడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. అదేవిధంగా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ట్రెండ్స్‌లో రెండో స్థానం సొంతం చేసుకుందని చిత్ర యూనిట్ తమ ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపింది.ఇక్కడ మీరు దానిని చూడవచ్చు.తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడువిడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం జయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని ప్రకటించారు.


తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.


English summary
Bahubali has topped the list of Google's most searched trends of 2015, beating Salman Khan's "Bajrangi Bhaijaan" and "Prem Ratan Dhan Payo" (PRDP).
Please Wait while comments are loading...