మహాబలేశ్వర్ వెళ్లనున్న ‘బాహుబలి’ టీం

By Bojja Kumar

హైదరాబాద్: ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్ పూర్తయింది. సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

 Baahubali heads to Mahabaleswar

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తర్వాతి షెడ్యూల్ మహాబేలేశ్వర్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 నుండి మహాబలేశ్వర్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని సమాచారం. అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ మళ్లీ రాజమోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కంటిన్యూ చేయనున్నారు.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. దాదాపు సంవత్సర కాలంగా షూటింగ్ ప్రక్రియ సాగుతూనే ఉంది. సినిమాను ఎలాగైన ఏప్రిల్ 2015 నాటికి ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించుకున్న రాజమౌళి....స్పీడు పెంచారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రానా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X