»   »  టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘బాహుబలి’

టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘బాహుబలి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్స్ ‘బాహుబలి-ది బిగినింగ్' త్వరలో కెనడాలో జరుగబోయే టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లబోతోంది. ఇక్కడ సినిమాను ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా కలిసొస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

ఇండియాలో ఈ చిత్రం దాదాపు రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. దేశీయ వసూళ్ల పరంగా ‘బాహుబలి-ది బిగినింగ్' నెం.1 స్థానంలో నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినిమా పరిశ్రమలో భారీగా లాభాలు తెచ్చిపెన సినిమా ఇది.


 Baahubali heads to Toronto film festival

త్వరలో బాహుబలి పార్ట్ -2 కూడా రాబోతోంది. 'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా. టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

English summary
Baahubali- The Beginning, India’s biggest motion picture, will have its private screening at the ongoing Toronto film festival in Canada.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu