»   » మార్కెట్లోకి ‘బాహుబలి’డీవీడీలు...ధర ఎంతంటే?

మార్కెట్లోకి ‘బాహుబలి’డీవీడీలు...ధర ఎంతంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా బిజినెస్ బాక్సాఫీసు వద్ద దాదాపుగా ముగిసి పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని బాషల్లో కలిపి రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా నిర్మాతలు ఈ సినిమా డీవీడీలను విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. సెప్టెంబర్ 30న హిందీ వెర్షన్ ‘బాహుబలి' డీవీడీలు విడుదల చేసేందుకుప్లాన్ చేస్తున్నారు.

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ‘అమేజాన్ డాట్ కామ్' ద్వారా ముందుస్తు బుకింగ్స్ ప్రారంభించారు. బ్లూ-రే ఫార్మాట్ రూ. 718, డీవీడీ ఫార్మాట్ రూ. 268 కు అమ్మకానికి పెట్టారు. మీరు ఇపుడు ఆర్డర్ చేస్తే విడుదల వెంటనే మీ ఇంటికి వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం... ఆర్డర్ చేసేయండి.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది.


విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.


Baahubali Hindi DVDs for sale

తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.


English summary
Buy Baahubali Online at Low Prices in India on Amazon.in.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu