షాకింగ్: బాహుబలికి అక్కడ రూ. 70 కోట్లు షేర్
హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా బాలీవుడ్లో కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధిస్తుంది. రెండు వారాల లోపే(జులై 22 వరకు) ఈ చిత్రం అక్కడ రూ. 70 కోట్ల షేర్ సాధించింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని బాలీవుడ్లో 10 నుండి 20 కోట్ల వస్తాయనే అంచనాతో విడుదల చేసారు. కానీ అంచనాలకు ఇప్పటి వరకు రూ. 70 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే రూ. 100 కోట్ల షేర్ సాధించినా ఆశ్చర్య పడనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇప్పటి వరకు ఏ సౌతిండియన్ సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు సాధించలేదు. బాలీవుడ్ రెగ్యులర్ సినిమాలతో సమానంగా అక్కడ బాహుబలి సినిమా ఆదరణ లభిస్తుండటం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది.
బాలీవుడ్లో బాహుబలి ప్రభంజనం ఇలా సాగుతోంది....

జులై 10(శుక్రవారం): రూ. 5.15 కోట్లు
జులై 11: రూ. 7.09 కోట్లు
జులై 12: రూ. 10.11 కోట్లు
జులై 13: రూ. 6.10 కోట్లు
జులై 14: రూ. 6.15 కోట్లు
జులై 15: 6.05 కోట్లు
జులై 16: 6.12 కోట్లు
జులై 17: రూ. 3.25 కోట్లు
జులై 18: 4.70 కోట్లు
జులై 19: 5.40 కోట్లు
జులై 20: 3.82 కోట్లు
జులై 21: 3.20 కోట్లు
జులై 22: 3.05 కోట్లు
13 రోజుల్లో సాధించిన షేర్: రూ. 70.19 కోట్లు


Click it and Unblock the Notifications











