ఆస్కార్ రేసులో ‘బాహుబలి’
హైదరాబాద్: సినిమా రంగానికి సంబంధించి ప్రపంచస్థాయి అవార్డు ‘ఆస్కార్' అవార్డు. సినిమా రంగంలోని వారు ఈ అవార్డు అందుకోవడం అంటే ప్రపంచ గుర్తింపు తెచ్చుకోవడమే. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డుల పండగ జరుగబోతోంది. ఈ సారి మన దేశం నుండి ఈ అవార్డు కోసం దాదాపు 45 సినిమాలు పోటీ పడుతున్నాయి.
ఆస్కార్ సెలక్షన్ పానెల్‌లో మెంబెర్ అమోల్ పాలేకర్ నేతృత్వంలో ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసే సినిమాను ఎంపిక చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి రాజమౌళిక్ దర్శకత్వంలో తెరకెక్కి ‘బాహుబలి' సినిమా అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనుంది అని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వెల్లడించింది.

బాలీవుడ్‌లోని అమీర్ ఖాన్ నటించిన ‘పీకే' చిత్రం, అనురాగ్ కశ్యప్ నటించిన ‘అగ్లీ' , విశాల్ భరద్వాజ్ నటించిన ‘హైదర్', ప్రియాంక చోప్రా నటించినటువంటి ‘మేరీ కొమ్'టో పాటు తమిళంలో బడ్జెట్ సినిమాలు అయినటువంటి ‘కాకముట్టై'. ఇంకా కొన్ని చిత్రాలు పోటీలో ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











