»   » నిర్మొహమాటంగా చెప్పిన రాజమౌళి: బాహుబలి స్టోరీకి ఆధారం అదే...

నిర్మొహమాటంగా చెప్పిన రాజమౌళి: బాహుబలి స్టోరీకి ఆధారం అదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినిమా చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ హంగులు, గ్రాఫిక్స్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి' చిత్రం గురించి రాజమౌళి ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. ‘మహాభారతం' ఆధారంగానే బాహుబలి స్టోరీ తయారు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ముంబైలో ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ....‘బాహుబలి-ది బిగినింగ్ స్టోరీకి ఇన్స్‌స్పిరేషన్ మహాభారతమే, రాబోయ బాహుబలి సెకండ్ పార్ట్ కు ఆధారం కూడా మహాభారతమే' అని రాజమౌళి చెప్పుకొచ్చారు. తన సినిమాలన్నీ ‘మహాభారతం', ‘రామాయణం' స్టోరీల నుండి ఇన్స్‌స్పైర్ అయి తీసినవే అని రాజమౌళి స్పష్టం చేసారు. నా చిన్నతనం నుండి మహాభారతం, రామాయణం నుండి తెలుసుకున్న విషయాలను ఆకలింపు చేసుకున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు.


 'Baahubali' inspired by 'Mahabharata'

‘బాహుబలి - ది బిగినింగ్' ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా జూన్ 1న సాయంత్రం ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో రాజమౌళి ఈ విషయాలను చెప్పుకొచ్చారు. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో బాహుబలి ముఖ్య తారాగణం ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు పాల్గొన్నాు.


బాహుబలి హిందీ వెర్షన్ కరణ్ జోహార్ కు చెందిన నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మార్కెట్లో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు ధర్మా ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. జులై 10న బాహుబలి-ది బిగినింగ్ విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
'Baahubali' is inspired by 'Mahabharata', and the upcoming second part is also inspired by 'Mahabharata'," Rajamouli said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu