»   » వినాయక చవితి వేడుకలపై ‘బాహుబలి’ ఎఫెక్ట్ (ఫోటోస్)

వినాయక చవితి వేడుకలపై ‘బాహుబలి’ ఎఫెక్ట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇతర సినిమాల ప్రభావం ఏమోగానీ.... ఈ సారి రాబోయే వినాయక చవితి వేడుకలపై రాజమౌళి సూపర్ హిట్ మూవీ ‘బాహుబలి' ప్రభావం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే వినాయక చవితి వేడుకల కోసం సిద్దమవుతున్న గణనాథుడి విగ్రహాలు బాహుబలి సినిమాను తలపించే విధంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.

బాహుబలి సినిమాలో ప్రభాస్ శివ లింగం ఎత్తే సన్ని వేశం, యుద్దంలో గుర్రంపై నుండి పోరాడే సన్ని వేశాలను పోలిన గణనాథులు ఈ వినాయక చవితికి సిద్ధమయ్యారు. ఇక వినాయక చవితి వేడుకల్లో ఎక్కడ చూసినా బాహుబలి ఫీవర్ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

బాహుబలి సినిమాలోని క్యారెక్టర్లను పోలి ఉన్న బొజ్జ గణపయ్య విగ్రహాలపై మీరూ ఓ లుక్కేయండి.

శివలింగాన్ని ఎత్తి..

శివలింగాన్ని ఎత్తి..


బాహుబలి సినిమాలో మాదిరిగా శివ లింగాన్ని ఎత్తిన ఫోజులు గణనాథుడు.

బాహుబలి లుక్

బాహుబలి లుక్


బాహుబలి సినిమాలో గుర్రంపై నుండి యుద్ధం చేసే లుక్ లో వినాయకుడు.

బుల్లి వినాయకుడు

బుల్లి వినాయకుడు


పలు బుల్లి వినాయకుడి ప్రతిమలు కూడా బాహుబలి రూపులతో తయారు చేసారు.

మంచి డిమాండ్

మంచి డిమాండ్


ట్రెండుకు తగిన విధంగా విగ్రహాలు తయారు చేయడం వల్ల మంచి డిమాండ్ ఉంటుందని, గతంలో ఈగ, గబ్బర్ సింగ్ వివిధ రూపాల్లో విగ్రహాలు తయారు చేసినట్లు తయారీ దారులు చెబుతున్నారు.

English summary
Ganesh idols made in Baahubali style.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu