»   » ముంబై మీడియాకు రివీలైంది: 'బాహుబలి' స్టోరీ పాయింట్ ఇదే

ముంబై మీడియాకు రివీలైంది: 'బాహుబలి' స్టోరీ పాయింట్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. రిలీజ్ కు దగ్గరకు పడుతున్న సమయంలో ఈ చిత్రం ప్రమోషన్ ని ముంబై లో చేస్తూ అక్కడ మీడియాతో అనుభవాలు పంచుకున్నారు. ఈ నేపధ్యంలో దగ్గుపాటి రానా మాట్లాడుతూ... చిత్రం స్టోరీ పాయింట్ ని రివీల్ చేసాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


రానా మాట్లాడుతూ.... ‘బాహుబలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి' సినిమా అని తెలిపాడు.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. రానా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.


ఈ సందర్భంగా ప్రభాస్‌, రానా, తమన్నా ముంబయి మీడియాతో పంచుకొన్న అనుభవాలు క్రింద స్లైడ్ షోలో...


ప్రభాస్ మాట్లాడుతూ...

ప్రభాస్ మాట్లాడుతూ...


రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇప్పటివరకు 380 రోజులు చిత్రీకరించారు దర్శకుడు రాజమౌళి. అందులో నేను 300 రోజులు నటించాను. వేలమందితో వందల రోజులు చిత్రీకరించాం. మూడేళ్ల క్రితం

మూడేళ్ల క్రితం


మనసుకు ఎంతో దగ్గరైన సినిమా ఇది. మూడేళ్ల క్రితం రాజమౌళిగారు ఈ కథ గురించి నాకు చెప్పినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని ప్రభాస్ అన్నారు.బాగుందనిపించింది...

బాగుందనిపించింది...


ప్రభాస్‌ మాట్లాడుతూ... సినిమా ట్రైలర్‌లో చూపించిన జలపాతాల దగ్గర సన్నివేశం అందరికీ నచ్చుతోంది. జలపాతం నేపథ్యంలో ఓ పాట కూడా ఉంటుంది. చిత్రీకరణలో భాగంగా తొలుత కొండ ఎక్కడం కష్టమనిపించింది. ఆతర్వాత ఐదారు రోజులకు బాగుందనిపించింది అని చెప్పారు.తమన్నా మాట్లాడుతూ...

తమన్నా మాట్లాడుతూ...


ఈ సినిమా గురించి రాజమౌళి చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యం, ఉత్సాహం కలిగాయి. సినిమా చిత్రీకరణలో రోజూ ఇలాంటి అనుభవాలు ఎన్నో. సినిమా కోసం తొలిసారిగా పోరాట సన్నివేశాలు, రోప్‌ వర్క్స్‌లో నటించాను. అంత భారీ స్థాయిలో చిత్రీకరించారు అన్నరామె.చిన్న కుర్చీ వేసేవారు...

చిన్న కుర్చీ వేసేవారు...


ప్రభాస్‌ పక్కన నిల్చోవాల్సి వచ్చినప్పుడు ఎత్తు ఇబ్బందులు వచ్చి చిన్న కుర్చీ వేసేవారు అని చెప్పింది తమన్నా. (నవ్వుతూ) పాటల దగ్గరకు వచ్చేసరికి వేళ్ల మీద నిలబడి డ్యాన్స్‌ చేశా.చాలా సార్లు కష్టమైంది...

చాలా సార్లు కష్టమైంది...


రాజుల కాలం నాటి సినిమా కాబట్టి కాళ్లకు చెప్పులు కూడా లేవు. కొన్నిసార్లు చాలా కష్టమైంది. అయినా ఇంతటి అద్భుతమైన సినిమాలో నటిస్తున్నాననే ఆలోచన ఎన్ని ఇబ్బందులనైనా దూరం చేసేది అని చెప్పుకొచ్చింది తమన్నారానా తో లేవు..

రానా తో లేవు..


రానాతో అయితే సన్నివేశాలేమీ లేవు. భారతీయ పరిశ్రమ గర్వించదగ్గ సినిమా ఇది. సినిమాలోని భావోద్వేగాలు బాగా పలికాయి అని చెప్పుకొచ్చారామె. రానా మాట్లాడుతూ...

రానా మాట్లాడుతూ...


రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా గొప్పతనాన్ని వర్ణించడానికి ఎన్ని ఉపమానాలు చెప్పినా చాలవు. మనసును తాకే ఓ అద్భుత దృశ్య కావ్యం ఈ చిత్రం అని అన్నారు.దాయాదాలు మధ్య పోరు

దాయాదాలు మధ్య పోరు


ఇద్దరు దాయాదుల మధ్య సాగిన పోరు ఇది. ఒకరు ప్రజల కోసం పాటుపడితే మరొకరు రాజ్యం ఏలాలనే కుతంత్రంతో ఆలోచిస్తుంటాడు. ఈ పోరులో విజయమెవరిదో తెరపైనే చూడాలి అని చెప్పారు.కరుణ్ జోహార్...

కరుణ్ జోహార్...


వచ్చే నెల 10న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీన్ని హిందీలో కరణ్‌ జోహార్‌, ఎ.ఎ.ఫిల్మ్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.ప్రభాస్ రెండు పాత్రల్లో..

ప్రభాస్ రెండు పాత్రల్లో..


బాహుబలి సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - రానా అన్నదమ్ములుగా కనిపించనున్నారు. అందులోనూ ప్రభాస్ బాహుబలి, శివుడు అనే రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు.ఎవరికి ఎవరు..

ఎవరికి ఎవరు..


బాహుబలి పాత్రకి జోడీగా అనుష్క కనిపించనుంటే, శివుడు పాత్రకి జోడీగా తమన్నా కనిపించనుంది.సెన్సార్ కు ...

సెన్సార్ కు ...


పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కి వెళ్లనుంది. సంగీతం...

సంగీతం...


ఆర్కా మీడియా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.భారీ అంచనాలు..

భారీ అంచనాలు..


ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.English summary
Speaking to the Mumbai media, Rana revealed that Baahubali is a rugged tale of two brothers who fight for the throne. Rana and Prabhas play cousin brothers in this film which is eyeing a massive release on July 10th.
Please Wait while comments are loading...