»   » చెంప చెల్లుమనిపించిన బాహుబలి బ్యూటీ: సెట్స్ నుండి గెంటివేత!

చెంప చెల్లుమనిపించిన బాహుబలి బ్యూటీ: సెట్స్ నుండి గెంటివేత!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సినిమా సెట్స్‌లో ఓ నటి పట్ల మరో నటుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బాలీవుడ్ మూవీ షూటింగులో చోటు చేసుకుంది. ఈ ఘటనతో షాకైన సదరు నటి అక్కడే అతడి చెంప చెల్లుమనిపించింది.

  ఆ నటి మరెవరో కాదు... 'బాహుబలి-ది బిగినింగ్‌'తో పాటు పలు టాలీవుడ్ చిత్రాల్లో ఐటం సాంగ్స్ చేసిన స్కార్లెట్ విల్సన్. ఈ నీచానికి పాల్పడ్డ నటుడి పేరు ఉమాకాంత్ రాయ్. 'హన్స: ఏక్ సన్యోగ్' అనే సినిమా షూటింగులో ఈ ఘటన చోటు చేసుకుంది.


  స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తుండగా

  స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తుండగా

  ‘హన్స: ఏక్ సన్యోగ్' సినిమా షూటింగులో భాగంగా స్కార్లెట్ విల్సన్ మీద స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో అదును చూసి ఉమాకాంత్ అనే నటుడు ఆమెను గోకే ప్రయత్నం చేశాడు. అతడి ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ స్కార్లెట్ చెంప చెల్లుమనిపించింది.


  సెట్స్ నుండి గెంటివేత

  సెట్స్ నుండి గెంటివేత

  ఊహించని ఈ సంఘటనతో చిత్ర యూనిట్ మొత్తం షాకయింది. అక్కడే ఉన్న సెట్స్ మేనేజర్ అతడికి తగిన బుద్ది చెప్పే ప్రయత్నం చేయగా, ఉమాకాంత్ ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు అంతా కలిసి అతడిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు గెంటేశారు.


  ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు

  ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు

  ఉమాకాంత్ మీద ఫిల్మ్ చాంబర్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అతడితో స్కార్లెట్‌కు క్షమాపణ చెప్పించడంతో పాటు ఆర్టిస్టుల అసోసియేషన్లో అతడి సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.


  వీడియో

  ఈ ఇన్సిడెంటుకు సంబంధించిన వీడియో కొందరు యూనిట్ సభ్యులు యూట్యూబ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో చూస్తే సంఘటన స్థలంలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవచ్చు.  English summary
  Baahubali actress Scarlett Wilson who was seen in song Manohari of the first part of the magnum opus, came across an actor, who not only tried to misbehave with her on the sets of her forthcoming movie titled Hansa – Ek Sanyog. According to a report on News Nation, an actor named Umakant Rai was seen making crude gestures towards the actress and even tried to touch her hair. That is when she lost her cool and angrily walked off the sets halting the shoot.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more