»   » అమెరికా నుండి ‘బాహుబలి’ లీక్: నేడో రేపో అరెస్టులు

అమెరికా నుండి ‘బాహుబలి’ లీక్: నేడో రేపో అరెస్టులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' చిత్రానికి సంబంధించిన 12 నిమిషాల వీడియో ఇటీవల ఆన్ లైన్లో లీకైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో యూనిట్ మొత్తం షాకయింది. రాజమౌళి ఈ విషయమై సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేసారు. ఎడిటింగ్ డిపార్టుమెంటు నుండే వీడియో లీకైందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు 10 మందిని పోసులు విచారిస్తున్నారు. త్వరలోనే ఎవరనే విషయాన్ని పసిగట్టనున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని సీసీఎస్ డీసీపీ రవివర్మ తెలిపారు. నేడో రేపు అరెస్టు ఉంటాయని సీసీఎస్ పోలీసులు అంటున్నారు. అమెరికా నుండి ఈ వీడియో లీకైందని సీసీఎస్ పోలీసులు కనుగొన్నారు. ఈ చిత్రానికి పని చేస్తున్న విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ సంస్థల్లో పని చేసే వ్యక్తులకు సంబంధం ఉందని తెలుస్తోంది. చిత్రంలో కీలకమైన 12 నిమిషాల వీడియోను విఎఫ్ఎక్స్ ఎడిటింగుకు ఇచ్చినపుడు ఒక వ్యక్తి దాన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసి వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు షేర్ చేసినట్లు తెలుస్తోంది.

Baahubali Leak: Rajamouli File Complaint

సినిమా గురించిన వివరాల్లోకి వెళితే...
బాహుబలి' సినిమాకు టాకీ పార్టు పూర్తయింది. జనవరి 24న ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. ఇక దర్శకుడు రాజమౌళి అండ్ టీం పోస్టు ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టారు. షూటింగ్ మొదలైనప్పటి నుండే పారలాల్ గా డబ్బింగ్ మొదలు పెట్టడంతో తెలుగు, తమిళం బాషల్లో ‘బాహుబలి' పార్ట్ -1కు సంబంధించిన అందరు ఆర్టిస్టుల డబ్బింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగుతో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం. ఇందుకు సంబంధించిన పనులు ఫిబ్రవరిలో మొదలు కానున్నాయి. ప్రముఖ సౌండ్ ఇజనీర్ పి.ఎం.సతీష్ సౌండ్ డిజైన్ మీద, డెబాజిత్ చాంగ్‌మై సౌండ్ మిక్సింగ్ మీద పని చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోరు, సంగీతం అద్భుతంగా రావడానికి ఎంఎం కీరవాణి రాత్రి పగలనక కృష్టిచేస్తున్నారు.

ఇక పోస్టు ప్రొడక్షన్ పనుల్లో అతి ముఖ్యమైన ‘విఎఫ్ఎక్స్' పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ విభాగంలో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్సన్ శ్రీనివాస్ మోహన్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇండియా, హాంకాంగ్, యూనైటెడ్ స్టేట్స్ లోని వివిధ స్టూడియోల్లో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్, ఆడియో వేడుక, ట్రైలర్స్ ఎప్పుడు అనే విషయం త్వరలో టీం బాహుబలి వారు వెల్లడించనున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తమిళ రైట్స్ ‘యూవి క్రియేటన్స్' వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో సంయుక్తంగా ‘బాహుబలి' చిత్రాన్ని వీరు తమిళనాడులో విడుదల చేయనున్నారు. తెలుగులో యూవి క్రియేషన్స్ వారు ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా ‘మిర్చి' చిత్రాన్ని తెరకెక్కించి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థకు మంచి నెట్వర్క్ ఉంది.

ప్రభాస్ కెరీర్లో ఈ సినిమా ఓ గొప్ప మైలురాయిగా ఉంటుందని అంటున్నారు. మరో వైపు అనుష్క, రానా కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం యావత్ తెగులు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

English summary
Tollywood director Rajamouli has lodged a complaint with the Central Crime Station police here over leaking of his new directorial venture 'Baahubali' movie's footage.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu