»   » మనల్ని ‘బాహుబలి’గా, భళ్ళాలదేవుడిలా మార్చేందుకు రాజమౌళి స్కెచ్

మనల్ని ‘బాహుబలి’గా, భళ్ళాలదేవుడిలా మార్చేందుకు రాజమౌళి స్కెచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: మనమే బాహుబలిగా మారిపోయి కాలకేయుడిని అంతమొందించవచ్చు! అలాగే భళ్ళాలదేవుడిలా మారి రాజకీయ స్కెచ్ లు వేయచ్చు!! అదెలా సాధ్యం అనుకుంటున్నారా? త్వరలో 'బాహుబలి' సినిమా ఆధారంగా ఓ మొబైల్‌ గేమ్‌ రాబోతోంది.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తాజా చిత్రం 'బాహుబలి'ని ఎంతగా ప్రమోట్ చెయ్యాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రమోషన్ తో పాటు డబ్బులు వచ్చే మార్గం ఆయన ఎంచుకుంటూ నిర్మాతలకు ఆనందం కలగచేస్తున్నారు.

ఆ మధ్యన 'బాహుబలి' అనే మహావృక్షానికి సినిమా కేవలం ఓ కొమ్మ మాత్రమేనని చెప్పిన రాజమౌళి ...ఇందులో భాగంగా కామిక్‌బుక్స్‌, వీఆర్‌ మొదలైన వాటిని తీసుకొచ్చారు. త్వరలోనే 'బాహుబలి' మొబైల్‌ గేమ్‌ను తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి మూన్‌ఫ్రాగ్‌ ల్యాబ్స్‌కు చెందిన మార్క్‌ స్కగాస్‌తో చర్చించారు.ఫామ్‌విల్లే, లార్డ్‌ఆఫ్‌ రింగ్స్‌ తదితర గేమ్‌లను సృష్టించింది ఈయేనే.

'Baahubali' Makers To Team Up With FarmVille Game Designer

'బాహుబలి' మొబైల్‌గేమ్‌కు సంబంధించి మార్క్‌ స్కగాస్‌తో రాజమౌళి చర్చలు జరిపిన చిత్రాలను ఆర్కా మీడియా అభిమానులతో పంచుకుంది.
ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించిన 'బాహుబలి' 2015లో విడుదలై సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా 'బాహుబలి: ద కన్‌క్లూజన్‌' ఈ ఏడాది ఏప్రిల్‌ 28న విడుదలకు సిద్ధమవుతోంది.

మరో ప్రక్క 'బాహుబలి 2' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించిందట. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 500 కోట్ల బిజినెస్‌ చేసినట్లు సమాచారం. కేవలం డిస్ట్రిబ్యూషన్‌, శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా ఈ చిత్రం రూ. 500 రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల్లో చెప్తున్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'బాహుబలి 2' చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. . 'బాహుబలి'కి కొనసాగింపుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలు పోషించారు.

'Baahubali' Makers To Team Up With FarmVille Game Designer

'బాహుబలి'నిదాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లు వసూలు చేసి... 2015లో భారత్‌లో అత్యధికంగా కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది.

English summary
Mark Skaggs, the brain behind popular games such as FarmVille and Lord of the Rings: Battle for Middle-Earth, is partnering with filmmaker SS Rajamouli to create a 'Baahubali' mobile game."Mark Skaggs (from Moonfrog Labs), creator of FarmVille and Lord of the Rings games (among others) discussing the creation of 'Baahubali' mobile game with SS Rajamouli. Exciting stuff coming your way. Stay tuned," read a post on the official Facebook page of 'Baahubali'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu