»   » కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘బాహబలి’ సందడి (ఫోటో)

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘బాహబలి’ సందడి (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న డ్రీమ్ ప్రాజెక్టు ‘బాహుబలి'ని తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో వివిధ బాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా ప్రమోషన్లు కూడా మొదలు పెట్టారు. తాజాగా ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘బాహుబలి' చిత్రాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ రిప్రజెంట్ చేసారు.

Baahubali Makes A Splash At Cannes

ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారిగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఇంటర్నేషనల్ రిలీజ్ కోసం...ఈ చిత్రం లెంగ్త్ కు రీకట్ చేయనున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ ...ఇంటర్నేషనల్ ఎంటర్నైమెంట్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

ఈ చిత్రం రెండు పార్ట్ లు కలిసి... 290 నిముషాలు వస్తుందని, పాటలు, కొన్ని సీన్స్ తీసేసి వెస్ట్రన్ ఆడియన్స్ కోసం వెర్షన్ ని రెడి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే...రన్ టైమ్ ని...రెండు పార్ట్ ల కథనం చెడకుండా, డ్రామా మిస్సవకుండా ఎడిట్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తమ చిత్రం కథ పూర్తిగా తమ ఒరిజనల్ అని, ఇండియన్ ఎపిక్ ఆధారంగా రెడీ చేయలేదని అన్నారు.

ఈ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నారు. ఆయన బాహుబలి సినిమా ఇంటర్నేషనల్ రిలీజ్ గురించి మాట్లాడడం కోసం అక్కడికి వెళ్ళారు. శోభు యార్ల గడ్డ మాట్లాడుతూ ‘ బాహుబలి ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం నేను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నాను. ఇప్పటి వరకూ అంటా పాజిటివ్ గానే ఉంది. ఫిల్మ్ మేకర్స్ తో కలిసి ఓ ప్రోడక్ట్ కి వరల్డ్ వైడ్ మార్కెట్ తీసుకురావడానికి కేన్స్ బెస్ట్ ప్లేస్. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని' శోభు యార్లగడ్డ తెలియజేశాడు. అంతే కాకుండా అక్కడి బ్రాస్సిరే డు కాసినో కేఫ్ స్టాఫ్ అంటా బాహుబలి టీ షర్ట్స్ తో సందడి చేస్తున్నారని వారి ఫోటోలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. రెండు పార్ట్స్ గా రానున్న బాహుబలి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

English summary
Rajamouli's Baahubali have stepped up their promotional activities. Today, Karthikeya and Senthil represented Baahubali at the world's most reputed film event, the Cannes Film Festival in France.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu