»   » అద్భుతం : ‘బాహుబలి’ ధీవర సాంగ్ మేకింగ్ (వీడియో)

అద్భుతం : ‘బాహుబలి’ ధీవర సాంగ్ మేకింగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి-ది బిగినింగ్'లో ప్రభాస్ జలపాతం ఎక్కేసీన్, తమన్నాను చేరుకోవడానికి పడిన కష్టం తెరపై ఒక విజువల్ వండర్‌గా చూపెట్టారు దర్శకుడు రాజమౌళి. అసలు అంత పెద్ద జలపాతం వద్ద ప్రభాస్ ఇలాంటి సాహసోపేతమైన సీన్లు ఎలా చేసాడు? అంటూ ప్రేక్షకులు ఆశ్చర్య పడే విధంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ జలపాతం పై నుండి తమన్నాను అందుకోవడానికి చేసే భారీ జంప్ ఉత్కంఠ భరితంగా ఉంటుంది.

అసలు ఇలాంటివి చేయడం సాధ్యమేనా? అనే రేంజిలో ఉంటాయి సినిమాలోని విజువల్స్. అయితే ఈ సీన్ల వెనక గ్రాఫిక్స్ మాయా జాలం ఉందనే విషయం అందరికీ తెలిసిందే కానీ.... గ్రాఫిక్స్ ఉన్నట్లు తెలియకుండా ఎలా తెరకెక్కించారనేది ఎవరికీ అంతుపట్టలేదు. ఇందుకోసం రాజమౌళి అండ్ టీం చాలా కష్టపడ్డారు.


Baahubali: Making of Dheevara Song

ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో కృత్రిమ జలపాతం సెట్ వేసారు. భారీ క్రేన్లు ఉపయోగించి ప్రభాస్‌తో జంప్ చేయించారు. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం రాజమౌళి అండ్ టీం ఎంత కష్టపడ్డారో తెలియాలంటే ఈ క్రింది వీడియో చూడాల్సిందే.

English summary
Watch the Making of Dheevara Song in Baahubali - The Beginning movie, starring Prabhas, Tamannaa.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu