»   » అప్పుడే మిలియనీర్ల క్లబ్బులో చేరిన ప్రభాస్!

అప్పుడే మిలియనీర్ల క్లబ్బులో చేరిన ప్రభాస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మిలియనీర్లు కావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ఫాలోయింగ్, భారీ మార్కెట్ విలువ ఉండే స్టార్ హీరోలకు మాత్రమే ఇది సాధ్యం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మిలియనీర్ల క్లబ్బులో చేరిపోయాడు. తన స్టార్ ఇమేజ్ స్టామినా ఏమిటో నిరూపించాకున్నాడు.

మిలియనీర్లంటే కొంపతీసి ధనవంతుల జాబితా అనుకోవద్దు.....మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిలియనీర్లను యూట్యూబ్ హిట్ ఆధారంగా నిర్ణయించడం ఈ మధ్య పాపులర్ అయింది. ఇంకా అర్థం కాలేదా? అదేనండీ స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లు, మేకింగ్ వీడియోలు యూట్యూబులో సృష్టించే రికార్డుల గురించి మేం మాట్లాడుతున్నాం.

Baahubali

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం మేకింగ్ వీడియో ఇటీవల ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేకింగ్ వీడియో వారం గడవక ముందే 1 మిలియన్(10 లక్షలు) హిట్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా ఇలాంటి రికార్డులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకే సాధ్యం. ఇపుడు ప్రభాస్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. అదన్నమాట సంగతి.

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి' షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.

ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

English summary
The "Making of Baahubali" video, which was released on Prabhas's birthday last week, has received more than 1 million views on the video-sharing site YouTube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu