బాహుబలి: సుపుత్రుడి వల్ల రాజమౌళి పరువుపాయే!
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన సినిమాలన్నీ విభిన్నంగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటమే ఇందుకు కారణం. మగధీర, ఈగ లాంటి చిత్రాలతో రాజమౌళి ఇండియన్ ప్రముఖ దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు జక్కన్న.
కాగా....తాజాగా వెలుగు చూసిన సంఘటనతో రాజమౌళి పరువు పోయినట్లయిందని అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇందుకు కారణం రాజమౌళి పుత్రరత్నం కార్తికేయనే. ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'బాహుబలి' మేకింగ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మేకింగ్ వీడియో అద్భుతంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు...తక్కువ కాలంలోనే 1 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది.
బాహుబలి మేకింగ్ వీడియో ఇంత బాగా రావడానికి కారణం....తన కొడుకు కార్తికేయ అంటూ రాజమౌళి పలువురికి చెప్పకొచ్చాడు. దీంతో కార్తికేయ తన టీంతో కలిసి అద్భుతమైన పనితనం కనబర్చాడని....రాజమౌళి వారసత్వం పునికి పుచ్చుకున్నాడని అంతా అనుకున్నారు. తాజాగా తేలింది ఏమింటే....బాహుబలి మేకింగ్ వీడియో కార్తికేయ సొంత కాన్సెప్టు కాదని, ఓ హాలీవుడ్ చిత్రం ప్రోమో నుంచి మక్కికి మక్కి కాపీ కొట్టారని రుజువైంది.
'కామిక్ ఎపిక్' అనే ప్రోమో ఆధారంగా సేమ్ టు సేమ్ కాపీ కొట్టి 'బాహుబలి' మేకింగ్ వీడియో తయారు చేసాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి అందరికీ తెలిసి పోయింది. కొడుకు కారణంగా రాజమౌళి పరువు పోయినట్లయిందని పలువురు చర్చించుకుంటున్నారు.
స్లైడ్ షోలో బాహుబలి మేకింగ్ వీడియో, కామిక్ ఎపిక ప్రోమోలను వీక్షించి.....రాజమౌళి పుత్రరత్నం కాపీ బాగోతాన్నీ మీరు తెలుసుకోండి మరి!
బాహుబలి మేకింగ్ వీడియో
బాహుబలి మేకింగ్ వీడియో ఎంతో అద్భుతంగా ఉందనే ప్రశంసలు అందాయి. అయితే పక్కన స్లైడ్లో కామిక్ ఎపిక్ ప్రోమో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది.
కామిక్ ఎపిక్ ప్రోమో
హాలీవుడ్ మూవీ కామిక్ ఎపిక్ మేకింగ్ వీడియో ఇది. ఆగస్టు నెలలోనే దీన్ని విడుదల చేసారు.

ప్రభాస్ ఫస్ట్ లుక్
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి' షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.

సినిమా వివరాలు
ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











