twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’: 'మమతల తల్లి' సాంగ్ రీమిక్స్ ( ఫన్నీ వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాహుబలి తొలి వీడియో సాంగ్‌ని ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఇప్పుడు రీమిక్స్ వెర్షన్ వచ్చేసింది. ప్లానెట్ ఆఫ్ ఏప్స్ విజువల్స్ ని ఈ పాటకు కలుపుతూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. సాంగ్ కు తగ్గట్లు కూర్చిన విజువల్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

    #Planetoftheapes #Baahubali "Mamatala Thalli" Song Remix | Samosafilms

    Posted by Samosafilms on Monday, June 15, 2015

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    తెలుగు పాటను రాజమౌళి విడుదల చేయగా, ఇంతకు ముందు హిందీ వెర్షన్ పాటను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశాడు. ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై హిందీలో విడుదల చేయనున్న విషయం విదితమే. తెలుగు, హింది, తమిళ, మళయాల బాషల్లో రూపొందిన ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    దాదాపు రూ: 200కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందిన 'బాహుబలి' గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం సెన్సార్ పనులను పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని అందుకుంది. దీంతో సినిమాకు సంబందించిన కార్యక్రమాలు దాదాపు పూర్తిచేసుకున్న చిత్ర బృందం జులై 10న భారీ విడుదలకు సిద్ధమవుతుంది.

    ప్రచార చిత్రాల్ని చూసి అందులోని సాంకేతికత గురించి హాలీవుడ్‌ సైతం చర్చించుకొంటోంది . తెలుగు,తమిళ, హిందీ,మళయాళ భాషల్లో విడుదల చేయటానికి రెడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రేక్షకుల కోసం ఈ చిత్రంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Baahubali Mamatala Thalli remix!

    చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ.... ''ప్రభాస్‌తో 'బాహుబలి' చేయాలని ఆరేళ్ల క్రితమే నిర్ణయించుకొన్నా. నా సినిమాల్లో ప్రతినాయకులకు చాలా ప్రాధాన్యముంటుంది. తను ఎంత బలంగా ఉంటే... కథానాయకుడి పాత్ర అంత బలంగా ఎలివేట్‌ అవుతుంది. అందుకే ప్రభాస్‌కంటే ఎత్తు, ప్రభాస్‌ కంటే బలంగా ఉన్న నటుడు కావాలనుకొన్నా. ఆ సమయంలో నాకు రానానే గుర్తొచ్చాడు. ఓసారి రానాని కలసి భళ్లాలదేవ పాత్ర గురించి చెప్పా. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు. మళ్లీ ఓ రోజు నా దగ్గరకు వచ్చి 'కథానాయకుడిగా నటిస్తున్నా, వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నా.

    ఇలాంటి సమయంలో ప్రతినాయకుడిగా కనిపించడం సరైనదేనా? మీరే సలహా ఇవ్వండి' అని నన్నే అడిగాడు. 'నేనేం చెప్పానో, నీ పాత్రని ఎలా తీర్చిదిద్దుతాను అన్నానో... అలానే తీస్తా.. నువ్వే నిర్ణయం తీసుకో..' అన్నాను. రెండుమూడు గంటలు ఆలోచించుకొని 'నేను భళ్లాలదేవాగా నటించడానికి సిద్ధమే' అన్నాడు. పైకి అలా కనిపిస్తాడుగానీ మనిషి చాలా సున్నితం. ఈ సినిమా ముగిశాక మా అందరికీ ఓ ఉత్తరం రాశాడు. ఈ టీమ్‌తో తనకున్న అనుబంధం పంచుకొన్నాడు. ఆ లెటర్‌ చూశాక మాకు కన్నీళ్లు ఆగలేదు. తనలో మంచి రచయిత ఉన్నాడనిపించింది. అందుకే 'బాహుబలి2'కి రచయితగా పనిచేయమని చెప్పా.

    ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం వహించారు.శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    After 'Avatar' remix of theatrical trailer, It's now time for getting hooked to the 'Planet Of The Apes' version of Baahubali's 'Mamatala Thalli'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X