»   » ఇపుడు మహేష్ బాబుతో... : బాహుబలి సాంగ్ రీమిక్స్ (వీడియో)

ఇపుడు మహేష్ బాబుతో... : బాహుబలి సాంగ్ రీమిక్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' ట్రైలర్ విడుదలైనప్పటి నుండి రీమిక్స్ లు మొదలైన సంగతి తెలిసిందే. బాహుబలి ట్రైలర్‌తో అవతార్ ట్రైలర్ రీమిక్స్, బాలయ్య లెజెండ్ ట్రైలర్ రీమిక్స్ చేసి వదలడం ఇప్పటికే చూసాం. ఈ రీమిక్సులకు మంచి స్పందన కూడా వచ్చింది. తాజాగా మహేష్ బాబుతో కూడా బాహుబలి సాంగ్ రీమిక్స్ చేసారు.

మహేష్ బాబు ‘1-నేనొక్కడినే' విజువల్స్‌తో బాహుబలి ‘మమతల తల్లి' సాంగును రీమిక్స్ చేసారు. ఇపుడు ఈ రీమిక్స్ సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించింది. మహేష్ బాబు అభిమానులు కూడా ఈ రీమిక్స్ బావుందంటూ హ్యాపీ ఫీలవుతున్నారు.బాహుబలి గురించి మహేష్ బాబు
ఇటీవల రోయిన్ బో ఆసుపత్రికి సంబంధించిన ఓ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బాహుబలి సినిమాపై తన అభిప్రాయం, శ్రీమంతుడు వాయిదా అంశాలపై స్పందించారు.


బాహుబలి గురించి మాట్లాడుతూ...‘తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ గర్వపడే సినిమా బాహుబలి. ఇండియన్ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్, భారీ ఎఫర్ట్ పెట్టిన సినిమా' అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. బాహుబలి, శ్రీమంతుడు సినిమా విడుదలకు మధ్య మూడు నాలుగు వారాల గ్యాప్ ఉండటమే మంచిదని వ్యాఖ్యానించారు.


Baahubali Mamathala Thalli Song remix with Mahesh Babu

‘ఇది పోటీ పడాల్సిన సమయం కాదు. హెల్దీ కాంపిటీషన్ ఉంటేనే అందరికీ మంచింది. అందుకే బాహుబలి సినిమా విడుదల ఉంది కాబట్టి శ్రీమంతుడు సినిమాను వాయిదా వేసాం' అని మహేష్ బాబు తన మనసులోని మాటను చెప్పారు. బాహుబలి, శ్రీమంతుడు రెండు సినిమాలు భారీ విజయం సాధించాలని మహేష్ బాబు ఆకాంక్షించారు. బాహుబలి టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

English summary
Checkout: Baahubali Mamathala Thalli Song remix with Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu