»   » మరో ట్విస్ట్: కట్టప్ప చేతిలో బాహుబలి చనిపోలేదా?

మరో ట్విస్ట్: కట్టప్ప చేతిలో బాహుబలి చనిపోలేదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్నకు సమాధానం కోసం యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' పార్ట్ -1లో ఉత్పన్నమైన ఈ ప్రశ్నకు త్వరలో రాబోతున్న బాహుబలి పార్ట్-2 సమాధానం దొరక బోతోంది.

  అయితే తాజాగా ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్న 'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బాహుబలి చనిపోయాడని ఎందుకు భావించాలి? బ్రతికి కూడా ఉండొచ్చు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. మరి విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.


  'బాహుబలి' సినిమా విడుదలకు ముందే రెండు భాగాలకు సంబంధించిన స్క్రిప్టు పూర్తయింది. బాహుబలి భారీ విజయం తర్వాత సీక్వెల్ లో ఎటువంటి మార్పులు చేయడం లేదు అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.


  బాహుబలి సినిమాలోని పాత్రలు మహాభారతం, రామాయణంలోని పాత్రలను స్పూర్తిగా తీసుకుని రూపొందించినవే అని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేసారు. బీష్ముడి స్పూర్తితో కట్టప్ప పాత్రను, శివగామిలో కైకేయి, గాంధారీ, కుంతి ఛాయలు కనిపిస్తాయని, బిజ్జలదేవ పాత్రలో శకుని తత్వం కనిపిస్తుందని, భల్లాలదేవ పాత్రలో రావణుడు, దుర్యోధనుడు కనిపిస్తాడని, బాహుబలిలో అర్జునుడు, రాముడు కనిపిస్తాడని చెప్పుకొచ్చారు.


  బాహుబలి

  బాహుబలి

  రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి-2' శరవేగంగా తెరకెక్కుతోంది.


  షూటింగ్

  షూటింగ్

  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.


  అంచనాలు భారీగా

  అంచనాలు భారీగా

  తొలి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో బాహుబలి-2పై అంచనాలు భారీగా ఉన్నాయి.


  రిలీజ్

  రిలీజ్

  2017 ఏప్రిల్ 14 నాటికి బాహుబలి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


  English summary
  Maybe this will put an end to the biggest puzzle, the nation is waiting to unfold. Vijayendra Prasad, father of Rajamouli and the story writer of Baahubali, left us a hint about what is coming in Baahubali 2, when he was asked why Kattappa killed Baahubali. He asked the interviewer in return, "Why do you think Baahubali got killed? For all you know, he might still be alive.". Is it giving us a hint to solve the most asked question? Oh wait! Is it leaving us another puzzle to solve?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more