»   » ‘బాహుబలి’ సినిమాపై అభిమానం వెర్రి తలలు వేస్తోంది!

‘బాహుబలి’ సినిమాపై అభిమానం వెర్రి తలలు వేస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా చూడాలనే ఆశతో ఉన్న అభిమానులు టికెట్స్ దొరకక పోవడంతో విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో ఓ అభిమాని కిరోస్ మీద పోసుకున్నట్లు తెలుస్తోంది. అదే జిల్లా సిరిసిల్లలో ఓ అభిమాని థియేటర్ పై నుండి దూకినట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది.

మరో వైపు ప్రకాశం జిల్లా పొదిలిలోని హరికృష్ణ థియేటర్‌ల్లో సాంకేతిక కారణాలతో సినిమా ప్రదర్శన ఆగి పోవడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. థియేటర్లో విధ్వంసం సృష్టించారు. 20 నిమిషాల పాటు వీరంగం సృష్టించారు. అయితే సమస్య సద్దుమనగడంతో ఫ్యాన్స్ కూల్ అయ్యారు. రాజమండ్రిలోని అశోక్ థియేటర్ పై కూడా అభిమానులు దాడికి దిగారు.


Baahubali movie fans over action

సినిమా కోసం ఫ్యాన్స్ ఓ మేకను బలి ఇచ్చినట్లు ఓ ఫోటో వాట్సప్‌లో హల్ చల్ చేసింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ పట్టణంలోని సినిమాక్స్‌ థియేటర్‌లో బాహుబలి మొదటి షోకు ఫ్యాన్స్‌ మేకను బలిచ్చారని చెబుతున్నారు. ఇలా ఓ సినిమా కోసం మేకను బలి ఇవ్వడం కలకలం రేపింది.


మరోవైపు బాహుబలి అభిమానులు కొన్ని థియేటర్లపై దాడులు చేస్తున్నారు. మొన్నటి మొన్న విశాఖలో బాహుబలి చిత్రం ప్రదర్శించడం లేదంటూ ఓ థియటర్ అద్దాలు పగలగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లోని విజయలక్ష్మీ థియేటర్‌పై ప్రేక్షకులు దాడి చేశారు. థియేటర్ యాజమాన్యం టిక్కెట్లను అమ్ముకుంటుందని ఆరోపించిన ప్రేక్షకులు థియేటర్‌పై రాళ్లతో దాడి చేశారు.

English summary
Baahubali movie fans over action at Theaters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu