‘బాహుబలి-2’ షూటింగ్ నిలిపివేస్తున్నారు..కారణాలు ఇవే!
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి-2' షూటింగ్ శర వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ ఓ నెల రోజుల పాటు నిలిపి వేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తీవ్రమైన ఎండల కారణంగా షూటింగ్ కష్టం అవుతుండటంతో మే నెలలో షూటింగ్ నిలిపి వేయాలని నిర్ణయించారు. తిరిగి జూన్ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది.
అయితే ఈ గ్యాపులో సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్, బాహుబలి సెట్స్‌కు సంబంధించిన వర్క్, ఆర్టిస్టులకు ట్రైనింగ్ లాంటివి కొనసాగుతాయి. జూన్ లో జరిగే షెడ్యూల్ కోసమే ఈ ట్రైనింగ్ అని తెలుస్తోంది.
ఈ విషయమై శోభు యార్లగడ్డ ట్వీట్ చేస్తూ...'బాహుబలి సినిమా షూటింగ్ మే నెలలో నిలిపి వేస్తునప్నాం. చాలా రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు, సెట్ వర్క్, ట్రైనింగ్ మొదలైనవి జూన్ షెడ్యూల్ కోసం కంటిన్యూ అవుతాయి' అని తెలిపారు.
సినిమా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం...అక్టోబర్ నెల వరకు బాహుబలి-2కు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. దసరా సందర్భంగా బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 14, 2017 నాటికి ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు.
బాహుబలి-1లో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొన్ని లోపాలు వెలుగు చూసాయి. పార్ట్-2లో అలాంటివి రిపీట్ కాకూడదనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఈ విషయపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారట. అందుకే విఎఫ్ఎక్స్ వర్క్ కోసం కావాల్సినంత సమయం కేటాయించాలని, ఎలాంటి లోపాలు లేకుండా విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉండాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
స్లైడ్ షోలో బాహుబలి-2 షూటింగుకు సంబంధించిన ఫోటోస్...

ప్రభాస్
బాహుబలి-2 షూటింగులో ప్రభాస్.

షూటింగ్ బ్రేక్
షూటింగ్ ఓ నెల రోజుల పాటు నిలిపి వేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కారణం
తీవ్రమైన ఎండల కారణంగా షూటింగ్ కష్టం అవుతుండటంతో మే నెలలో షూటింగ్ నిలిపి వేయాలని నిర్ణయించారు. తిరిగి జూన్ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది.

అవి కంటిన్యూ
అయితే ఈ గ్యాపులో సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్, బాహుబలి సెట్స్‌కు సంబంధించిన వర్క్, ఆర్టిస్టులకు ట్రైనింగ్ లాంటివి కొనసాగుతాయి.

షూటింగ్
అక్టోబర్ నెల వరకు బాహుబలి-2కు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.

టీజర్
సరా సందర్భంగా బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

రిలీజ్
సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 14, 2017 నాటికి ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











