»   » బస్ లో 'బాహుబలి' పైరసీ సీడీ ప్లే చేసారు..ఇదిగో (వీడియో)

బస్ లో 'బాహుబలి' పైరసీ సీడీ ప్లే చేసారు..ఇదిగో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా అద్భుత సృష్టి బాహుబలి.తెలుగు,తమిళ భాషలలో రూపొందించిన అత్యంత భారీ చిత్రం ఇది . ప్రభాస్,రానా,అనుష్క,తమన్న,రమ్యక్రిష్ణ,సత్యరాజ్,నాజర్ తదితరులు ప్రదాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడీ చిత్రం పైరసీ సమస్యను ఎదుర్కోవటం చాలా మంది అభిమానులను ఆందోళన పరుస్తోంది.

ఈ చిత్రం పైరసీని ఆపటానికి చాలా ప్రయత్నాలు చేసినా ఎక్కడో చోట ఈ పైరసీ వృక్షం మొలకెత్తుతూనే ఉంది. ఇలాంటి సంఘటన రీసెంట్ గా జరిగింది. ఈ విషయమై ఓ అభిమాని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన వీడియోని మీ ముందు ఉంచుతున్నాం.


Hi Everyone,Yesterday(12.07.2015,Sunday),I was supposed to travel in my return flight from Pune to Bangalore along with my friends Satish Only For Friends Satyanarayana Murthy Nudurupati Shanmukh Shannu I reached airport just 5mins before the flight schedule departure....they didn't allow me to get into the flight,Somehow luckily got the NATIONAL TRAVELS bus ticket from PUNE to Bangalore.Here comes the main story,As soon as I got into the bus I was shocked,felt bad &emotional that's why I thought of posting here.Can you imagine what is that?? They are playing BAHUBALI Movie[Privacy Print (But it was very clear)Hindi version] that to on the second day of release.Here I am attaching the captured video while playing the BAHUBALI Movie in the bus. This Movie is really an HARDWORK & DEDICATION of 1000's of technicians who worked day & night for this project.If you really RESPECT there hard work then please share this post as much as you can till it reaches to the person's who can legally take action on them.Bus Details: Travels Name : National(A/C Multi axle) From : Pune To : Bangalore Journey Date : 12.07.2015 Bus Reg Num : KA 01 AA 9663 Please let's fight for a good cause. I tried with my first public post...Now it's your turnTagging SS Rajamouli for quick response SS RajamouliNOTE: I don't want to like this post, But please share this post


Posted by Pavan Kumar on Monday, July 13, 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


వైజాగ్ కు చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. రీసెంట్ గా పవన్ కుమార్ తన స్నేహితులతో కలిసి ..పూనే నుంచి బెంగుళూరు వెళ్తున్నారు. అక్కడ హస్ మిస్ అవ్వగా...నేషనల్ ట్రావెల్స్ వారి బస్ ని పట్టుకున్నారు. ఆ బస్ లో ఈ చిత్రం హిందీ వెర్షన్ ...పైరసీ సిడీని టెలీకాస్ట్ చేసారు. ఈ పైరసీ వెర్షన్ ఎప్పుడూ రిలీజ్ అయ్యింది ..రిలీజైన రెండో రోజు. వెంటనే పవన్ కుమార్ ఆ బస్ నెంబర్ తో కలిపి ఈ వీడియోని ఫేస్ బుక్ లోడ్ చేసారు. మరి ఏం చర్య తీసుకున్నారో..తీసుకుంటారో చూడాల్సి ఉంది.


ఇక సినిమా చూసిన వారందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో తీశాడంటూ ప్రశంసిస్తున్నారు. పాత్రలు వేటికవే సాటిగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యపాత్రధారులు విశ్వరూపం చూపించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణ గొప్పగా నటించారని చెబుతున్నారు. అవంతికగా తమన్నా ఒదిగిపోయిందని అంటున్నారు.


Baahubali Movie Pirated Version Played On National Travels Bus

హీరో ప్రభాస్, విలన్ దగ్గుబాటి రానా పోటీపడీ నటించారని తెలిపారు. క్లైమాక్స్ లో 45 నిమిషాలు సాగిన యుద్ధసన్నివేశాలు హైలెట్ గా నిలిచాయని తెలిపారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ రేంజ్ లో ఉన్నాయన్నారు. ఇక సినిమా ప్రముఖులు కూడా మాస్టర్ పీస్ అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం వస్తున్న స్పందనను బట్టి చూస్తే 'బాహుబలి' భారీ హిట్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఒక్క హైదరాబాద్ లోనే సినిమా లిస్టింగ్స్ చూస్తే.. బాహుబలి కాకుండా మిగిలినవి మూడు నాలుగు సినిమాలే. అవి కూడా ఉన్నది రెండు మూడు థియేటర్లలోనే. ఈ రేంజిలో విడుదల చేసిన బాహుబలి... ఇండస్ట్రీ అంచనాలకు తగినట్లుగానే వసూళ్లు చేసింది.


ఒక్క మొదటి రోజే తెలుగు వెర్షన్ ఒక్కటే 30.7 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ ఓపెనింగ్స్ లో ఇప్పటివరకు ఏ సినిమా సాధించనంత స్థాయిలో తొలిరోజు కలెక్షన్లు రావడంతో.. ఇక తమిళ, హిందీ వెర్షన్లు కూడా కలిపితే ఇది 60 కోట్లు దాటింది.


అమెరికాలో తెలుగు వెర్షన్ కు మూడు రోజులు కలిపి 34,56,605 డాలర్లు.. అంటే, 21.91 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు అమెరికాలో ఇంత వసూళ్లు రాలేదు. ఆగండి.. అప్పుడే అయిపోలేదు. అక్కడ తమిళ వెర్షన్ కూడా రిలీజైంది. దానికి కూడా మొదటి మూడు రోజుల్లో 98.82 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే రెండూ కలిపితే దాదాపు రూ. 23 కోట్లన్న మాట.

English summary
“Baahubali” piracy DVD’s have been produced.Pavan Kumar native of Visakhapatnam and some of his friends who were supposed to travel from Pune to Bangalore missed there flight but luckily they got into national travels. There they found that Hindi version of film ‘Baahubali’ was telecasting at their travel. The most shocking news was, the pirated video was released the very second of the film’s release.
Please Wait while comments are loading...