twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ సినిమా టోటల్ టీం (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పుట్టినరోజును పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ టీం మొత్తం ఫోటోకు ఫోజు ఇచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

    Baahubali movie technical Team

    ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. రానా ఇందులో నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.

    దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.

    భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Here is the snap taken on the sets of 'Baahubali' when the film's Art Director Sabu Cyril celebrated his 52nd birthday. All the technical team of this period drama have been part of this photo moment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X