»   » బాహుబలి బుకింగ్స్ షురూ....ఫ్యాన్స్‌కి మొండి చేయి!

బాహుబలి బుకింగ్స్ షురూ....ఫ్యాన్స్‌కి మొండి చేయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా జులై 10న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ అడ్వాన్డ్స్ శుక్రవారం బుకింగ్ మొదలైంది. థియేటర్ల వద్ద, ఆన్ లైన్ సైట్లలో కూడా బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బాహుబలి సినిమా అభిమానులు థియేటర్ల వైపు పరుగులు తీసారు. ఆన్ లైన్ సదుపాయం ఉన్నవారు ఆ దిశగా టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అయితే టికెట్స్ ఇస్తున్న విషయం తెలిసిన వెంటనే థియేటర్ల వద్దకు భారీగా జనం చేరుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్ లైన్లో కూడా టికెట్ల కోసం పోటెత్తడంతో బుక్ మై షో, ఇతర ఆన్ లైన్ సైట్ల సర్వర్ డౌన్ అయి టికెట్స్ బుక్ కావడం లేదు. ఈ కారణాలతో టికెట్స్ కోసం ప్రయత్నించిన వారికి మొండి చేయి ఎదురు కాక తప్పలేదు. విదేశాల్లో ఇలాంటి ఇబ్బందులు లేవు. యూఎస్, కెనడా, యూకె, యూఏఇ ఇతర దేశాల్లో ముందస్తు బుకింగ్స్ సవ్యంగానే సాగుతున్నాయి. అయితే టికెట్స్ ధరే కాస్త ఎక్కువ అని అంటున్నారు.


 Baahubali Movie Tickets Sold like Hot Cakes

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది.


బాహుబలి పార్ట్ 1 ఒక్క తెలుగులోనే ఇప్పటి వరకు దాదాపు 83 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రిలీజ్ ముందే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగలేదు. శాటి లైట్ రైట్స్, ఇతర రైట్స్ ఇలా అన్ని కలిపి పార్ట్ 1 ఇప్పటికే 125 కోట్ల బిజినెస్ చేసింది. ఇక తెలుగు, తమిళం, మళయాలం, విదేశీ వెర్షన్లు కలిపితే ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు కలెక్షన్లు సాధించడం ఖాయం అంటున్నారు. ఓవరాల్ గా బాహుబలి మూవీ బిజినెస్ 300 కోట్లు దాటుతుందని అంచనా.

English summary
Baahubali Movie Tickets Sold like Hot Cakes.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu