Just In
- 1 hr ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 2 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 3 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బహుబలి: షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది?
హైదరాబాద్: రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ‘బాహుబలి' చిత్రంపై తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు...ఆయన దర్శకత్వం గురించి తెలిసిన భారతీయ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాను ఎట్టి పరిస్తితుల్లోనూ సమ్మర్లో విడుదల చేయడానికి రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....షూటింగ్ మరో వారం రోజుల్లో పూర్తి కానుందని తెలుస్తోంది. మరో రెండు సాంగుల చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉంది. విఎఫ్‌ఎక్స్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ మిగిలి ఉంది. ప్రధాన తారాగణం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావొచ్చాని తెలుస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ ని ఫిభ్రవరి 2015 మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వంద సెకండ్ల ట్రైలర్ ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎడిటర్స్ ... ట్రైలర్ ని తీర్చిదిద్దుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. మరో ప్రక్క ఆ మధ్యన విడుదల చేసిన 'విజువలైజింగ్ ది వరల్డ్ ఆఫ్ బాహుబలి' వీడియోకు వచ్చిన స్పందన పట్ల యూనిట్ సంతోషంగా ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తమిళ రైట్స్ ‘యూవి క్రియేటన్స్' వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో సంయుక్తంగా ‘బాహుబలి' చిత్రాన్ని వీరు తమిళనాడులో విడుదల చేయనున్నారు. తెలుగులో యూవి క్రియేషన్స్ వారు ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా ‘మిర్చి' చిత్రాన్ని తెరకెక్కించి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థకు మంచి నెట్వర్క్ ఉంది.
చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ పుస్తకంలో చిత్రం మేకింగ్ గురించి ఉంటుందని చెప్పుకుంటున్నారు. చిత్రం కోసం వేసిన స్కెచ్ లు, షూటింగ్ విశేషాలతో ఈ పుస్తకం సిద్దం చేస్తున్నట్లు వినికిడి. సినీ లవర్స్ కు ఈ పుస్తకం మంచి గిప్టే మరి. 2015 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: యం.యం.కీరవాణి.