బాహుబలి: ప్రభాస్, అనుష్క, రానా హోంవర్క్ (ఫోటోలు)
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్ పైకి రాక ముందు నుండే టీం మొత్తం చాలా కష్టపడుతోంది. షూటింగు సమయంలోనూ అలుపు లేకుండా కష్ట పడుతున్నారు.
బాహుబలి సినిమా యూనిట్ సభ్యులు పడుతున్న కష్టాన్ని ప్రతిభించే ఫోటోలను ప్రభాస్ తన సోషల్ నెట్వర్కింగు ద్వారా విడుదల చేసారు. అందుకు సంబంధించిన ఫోటలు, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

బాహుబలి
ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. రానా ఇందులో నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.

ప్రత్యేకత
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా ‘బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.

సాంకేతికంగా
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

ఇంటర్నేషనల్ రేంజ్
ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

రాజమౌళి చాలెంజ్
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థానికి తీసుకెళ్లే విధంగా రాజమౌళి చాలెంజింగ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సినిమా కోసం ప్రభాస్ పెళ్లి వాయిదా
ఈ సినిమా కోసం ప్రభాస్ తన పెళ్లి అంశాన్ని కూడా వాయిదా వేసుకున్నారంటే.....ఆయన అకమిట్మెంట్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











