»   » రాజమౌళి శ్రమకు ప్రతిబింభం... (బాహుబలి వర్కింగ్ స్టిల్స్)

రాజమౌళి శ్రమకు ప్రతిబింభం... (బాహుబలి వర్కింగ్ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి'...ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న వార్ ఫిల్మ్. రూ. 250 కోట్ల బడ్జెట్, భారీ తారాగణం, భారీ గ్రాఫిక్స్ ఇలా అన్ని విషయాల్లోనూ భారీ తనం ప్రదర్శిస్తూ తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమా.

సినిమాను ఎలా తీయాలి, ఎవరితో తీయాలి, టెక్నీషియన్లు ఎవరైతే తమ సినిమాకు అనుకూలంగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీయాలి, భారీ సెట్టింగులు, షూటింగుకు కావాల్సిన సామాగ్రి, షూటింగ్ లొకేషన్లు, షూటింగ్ షెడ్యూల్స్....తదితర విషయాలను ప్లాన్ చేసుకోవడానికి (ప్రీ ప్రొడక్షన్) దాదాపు సంవత్సర కాలం పట్టింది రాజమౌళికి.


ఇక సినిమా షూటింగు మొదలయ్యాక తాను ప్లాన్ చేసుకున్న విధంగా, ఆయా లొకేషన్లలో తీయడం, అనుకున్న సమయంలో, అంచనా వేసిన బడ్జెట్ తో సినిమా పూర్తి చేయడానికి రెండేళ్ల సమయం పట్టింది. సినిమాలో కీలక భూమిక పోఫించే గ్రాఫిక్స్ వర్క్స్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాబట్టేందుకు చాలా డబ్బు ఖర్జు పెట్టారు కూడా. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా.... ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ‘బాహుబలి' తొలి భాగాన్ని జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


సినిమా కోసం ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి మేర శ్రమించారు. అయితే ఇండియన్ సినిమా చరిత్రలో ‘బాహుబలి' లాంటి గొప్ప సినిమా రావడానికి మాస్టర్ మైండ్ రాజమౌళి. ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. నటీనటుల నుండి, టెక్నీషియన్స్ నుండి తాను తాను కోరుకున్నది రాబట్టుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఈ ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది.


రాజమౌళి
  

రాజమౌళి

హీరో ప్రభాస్ కు షూటింగ్ సమయంలో సీన్ తాను స్వయంగా చేసి వివరిస్తున్న రాజమౌళి.


గుర్రంపై
  

గుర్రంపై

గుర్రపు స్వారీ చేస్తూ సీన్ వివరిస్తున్న రాజమౌళి.


టెక్నికల్ టీం
  

టెక్నికల్ టీం

రాజమౌళికి ది బెస్ట్ టెక్నికల్ టీం దొరికారు.


నిర్మాత
  

నిర్మాత

షూటింగ్ లొకేషన్లో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ.


సీన్ వివరిస్తూ...
  

సీన్ వివరిస్తూ...

నటీనటులకు సీన్ వివరిస్తున్న రాజమౌళి


Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu