»   » సూపర్ ఐడియా: ‘బాహుబలి’ మ్యూజియం!

సూపర్ ఐడియా: ‘బాహుబలి’ మ్యూజియం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రావడం వెనక మూడేళ్ల కష్టం, వందల మంది టెక్నీషియన్లు, నటులు శ్రమ దాగి ఉంది. అంతే కాదు సినిమా నిర్మాణంలో కోట్ల రూపాలు కరిగిపోయాయి. షూటింగ్ సమయంలో రక్తం చిందిన(గాయాల కారణంగా) సందర్భాలు కూడా ఉన్నాయి.

బాహుబలి సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ నేతృత్వంలో భారీ ఎత్తున ప్రీపొడక్షన్ వర్క్ జరిగింది. దాదాపు 20 వేల స్కెచ్ బాహుబలి కోసం వేసారు. వాటికి కార్యరూపం తెచ్చి భారీ సెట్టింగులు వేసారు. అందులో వంద అడుగుల రానా విగ్రహం హైలెట్.


ఇక బాహుబలి సినిమాలోని యుద్ధ సన్నివేశాల్లో వాడటానికి దాదాపు 20 వేల ఆయుధాలు తయారు చేసారు. వాటికి స్వయంగా చేత్తో రంగులు వేసారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్నపాటి కర్మాగారమే ఏర్పాటు చేసారంటే అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ సినీ చరిత్రలో గతంలో ఏ సినిమా లేని విదంగా బాహుబలి నిర్మాణం జరిగింది. బాహుబలి సినిమా కోసం తయారు చేసిన వస్తువులు, సెట్టింగులతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.


మూడున్నరేళ్లు

మూడున్నరేళ్లు

బాహుబలి సినిమా కోసం ఇప్పికే మూడున్నరేళ్ల సమయం వెచ్చించాము. సీక్వెల్ కూడా ఉంది కాబట్టి ఈ సమయం మరింత పెరుగుతుంది అన్నార సాబు సిరిల్.


హాల్లో పుట్టింది

హాల్లో పుట్టింది

బాహుబలి సినిమా హాల్లో పుట్టిన కథ. దీనికి ఎలాంటి రెఫరెన్సులు లేవు. 2వేల సంవత్సరాల కిందటి వాతావరణాన్ని ప్రతిభింభిస్తూ సాగుతుంది. దీని కోసం ప్రతీది కొత్తగా సృష్టించాల్సి వచ్చింది.


500 లొకేషన్లు...

500 లొకేషన్లు...

బాహుబలి సినిమా చిత్రీకరణ కోసం 500 లొకేషన్లు పరిశీలించారు.


వేలాది స్కెచ్ లు

వేలాది స్కెచ్ లు

బాహుబలి సినిమా కోసం 12 వేల స్కెచ్ లు వేసాం. దర్శకుడికి చూపించడానికి ముందు మాకు మేము వేసుకున్నవి కలిపితే 20 వేలు దాటుతుంది అన్నారు సాబు సిరిల్. పాత్రల రూపురేఖల కోసం ప్రత్యేకమైన స్కెచ్ లు వేసాం. వీటికి ఏడాది సమయం పట్టిందన్నారు సాబు సిరిల్.


బాహుబలి కోసం మహిష్మతి రాజ్యం

బాహుబలి కోసం మహిష్మతి రాజ్యం

బాహుబలి కోసం మేం సృష్టించిన మహిష్మతి రాజ్యం, రాజభవనం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే...చూడ్డానికి రెండు కళ్లు చాలవేమో అనేంత పెద్దగా ఉంటాయి.


భారీ సెట్టింగ్స్

భారీ సెట్టింగ్స్

మామూలుగా ఎంత పెద్ద సెట్టింగ్స్ అయినా 24 అడుగుల ఎత్తు, 10/10 పిల్లర్స్ వేసి నిర్మాణం చేపడుతుంటాం. కానీ మహిష్మతి కోసం 45 అడుగుల ఎత్తుతో పిల్లర్స్ వేసి సెట్స్ తీర్చి దిద్దాం. విజువల్ ఎఫెక్ట్స్ తో వాటి పరిధి కొన్ని రెట్లు విస్తృతం అవుతాయి అన్నారు సాబు సిరిల్.


భల్లాలదేవ విగ్రహం

భల్లాలదేవ విగ్రహం

బాహుబలి సినిమాలో భల్లాలదేవ విగ్రహాన్ని 200 మంది నెల రోజుల పాటు పని చేసి తీర్చి దిద్దినట్లు సాబు సిరిల్ తెలిపారు. తల భాగం ఒక్కటే 28 అడుగుల ఎత్తు ఉంటుందన్నారు. విగ్రహం మొత్తం ఎత్తు 100 అడుగులు.


నిలబెట్టడం కష్టమైంది

నిలబెట్టడం కష్టమైంది

100 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టడం చాలా కష్టమైంది.న అందుకోసం 4 భారీ క్రేన్లు, పెద్ద పెద్ద బుల్డోజర్లు వాడాం. విగ్రహ తయారీకి 3డి ప్రింటింగ్ సహాయం తీసుకున్నాం అన్నారు.


భారీగా ఖర్చు పెట్టారు

భారీగా ఖర్చు పెట్టారు

సెట్స్ తీర్చి దిద్దేప్పుడు ఇంత ఖర్చు అవుతుందని అటుఇటుగా చెబుతాం. తర్వాత వ్యవహారాలన్నీ నిర్మాతే చూసుకుంటాడు. సెట్స్ కోసం కాంట్రాక్టు కుదుర్చుకోవడం లాంటివి చేయను. మా ప్రతిబను నమ్మి నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు అన్నారు సాబు సిరిల్


రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీ ఉండటం వల్లనే బాహుబలి సినిమా సాధ్యమైందని, వందల ఎకరాల విస్తీర్ణం ఉండటం వల్ల యుద్ద సన్నివేశాలు, సెట్టింగ్స్ ఇలా అన్ని సాధ్యమైంది.


యంత్రాలతో నడిచే గుర్రాలు, ఏనుగులు

యంత్రాలతో నడిచే గుర్రాలు, ఏనుగులు

బాహుబలి సినిమా కోసం యంత్రాలతో నడిచే గుర్రాలు, ఏనుగులు, అడవి దున్నలు, పాముల్ని కూడా తయారు చేసినట్లు సాబు సిరిల్ తెలిపారు.


వార్ మెషీన్లు

వార్ మెషీన్లు

చిత్రీకరణ కోసం 25, 30 అడుగుల ఎత్తున్న వార్ మెషీన్లు తయీరు చేసి చిత్రీకరణ కోసం వాడినట్లు సాబు సరిల్ తెలిపారు.


అది కూడా...

అది కూడా...

బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపించే పిల్లాడు కూడా బొమ్మే. దాన్ని స్వయంగా తయారు చేసారు.


20 వేల ఆయుధాలు

20 వేల ఆయుధాలు

బాహుబలి సినిమా కోసం 20 వేల ఆయుధాలు తయారు చేసాం. ఇన్ని ఆయుధాలకు చేత్తో రంగులు వేసామని సాబు సిరిల్ తెలిపారు.


చిన్న కర్మాగారం

చిన్న కర్మాగారం

ఆయుధాల తయారీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్నపాటి కర్మాగారానే ఏర్పాటు చేసారట.


కార్బన్ ఫైబర్ తో

కార్బన్ ఫైబర్ తో

బాహుబలి చిత్రానికి సంబంధించిన ఆయుదాలు కార్బన్ ఫైబర్ తో తయారు చేసారు. బాహుబలి సెట్స్ కూడా ఫైబర్ తో చేసినవే.


మళ్లీ ఉపయోగించొచ్చు

మళ్లీ ఉపయోగించొచ్చు

బాహుబలి సినిమా కోసం తయారు చేసిన వస్తువులు భవిష్యత్తులో ఇతర సినిమాలకు కూడా ఉపయోగించవచ్చు.


విదేశాల నుండి

విదేశాల నుండి

బాహుబలి సినిమా సెట్స్ వేయడానికి విదేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకున్నారు.
English summary
For the first time ever in Indian cinema, a museum is being created of a film(Baahubali).
Please Wait while comments are loading...