»   » 'బాహుబలి' నేషనల్ అవార్డ్: రాజమౌళి ఏమంటున్నారంటే... (వీడియో)

'బాహుబలి' నేషనల్ అవార్డ్: రాజమౌళి ఏమంటున్నారంటే... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : 63వ జాతీయ ఫిల్మ్ అవార్డులను రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిమందే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి స్పెషల్ ఎఫ్టెక్స్ కేటగిరీలోనూ అవార్డు దక్కింది.

ప్రొడెక్షన్, సినిమా విలువలతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టిన బహూబలిని ఫిల్మ్ జ్యూరీ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసింది. ఫాంటసీ విలువలను కూడా బాహుబలి అత్యద్భుతంగా తెరకెక్కించిందని జ్యూరీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో బాహుబలి దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. ఆయనేం మాట్లాడారో ఈ క్రింద వీడియోలో చూడండి.


Baahubali National Award: In Conversation with SS RAJAMOULI

మరో ప్రక్క... రాజమౌళి భన్సాలీలలో ఉత్తమ దర్శకుడు అవార్డుకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై జ్యూరీ మెంబర్లలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవ్వడంతో రాజమౌళి భాన్సాలీల మధ్య నెక్ టు నెట్ పోటీ ఏర్పడిన విషయాన్ని బయట పెట్టాడు.


Also Read: ఛీఛీ..ఇదేం చీప్ టేస్ట్: బాహుబలి చేత...ఎన్టీఆర్ సాంగ్(వీడియో)


'బాహుబలి ఖచ్చితంగా చాలా గొప్ప చిత్రమే. హాలీవుడ్ స్థాయిని మన భారతీయ సినిమాలు అందుకుంటాయని నిరూపించిన మూవీ ఇది. కానీ సన్నివేశాల చిత్రీకరణలో అదేవిధంగా నటీ నటుల ప్రతిభను తెరకెక్కించడంలో ఉద్వేగాలను చిత్రీకరించడంలో 'బాజీరావ్ మస్తానీకే' ఎక్కువ మార్కులు పడ్డాయి' అని వివరణ ఇచ్చాడు కౌషిక్.


అదే విధంగా 'బాహుబలి' సినిమా విషయంలో జాతీయ అవార్డుల ప్యానల్ అన్యాయం చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో 600 కోట్ల కలక్షన్స్ ను వసూలు చేసిన 'బాహుబలి' సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డును ఇచ్చి సరిపెట్టడమే కాకుండా ఈ సినిమాలో కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ మాత్రమే బాగున్నాయి అన్న సంకేతాలు వచ్చే విధంగా ఈసినిమాకు జాతీయ స్థాయి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు ఇచ్చారు.


ముగ్గురు జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఈసారి డిజిటల్ రూపంలో ఎంట్రీలు వచ్చాయి. ఫీచర్ కేటగిరీలో 29 భాషల్లో 308 సినిమాలు ఎంట్రీ వచ్చాయి. మొత్తం రెండు నెలల పాటు సెలక్షన్ ప్రక్రియ కొనసాగినట్లు సభ్యులు తెలిపారు. అవార్డులు ప్రకటించిన వాళ్లలో ఫిల్మ్ బోర్డుకు చెందిన గంగమరియన్, సంజీవ్‌దత్తా, జాన్, ధరమ్ గులాటీ, జాన్ సహాయ్, ఎస్‌ఆర్ లీలా, శ్రీకే వాసు, సతీశ్ కౌశిక్ ఉన్నారు.

English summary
Here's S.S. Rajamouli in conversation about his National Award winning directorial Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu