బాహుబలి : రేపు రాజమౌళి బర్త్ డే స్పెషల్ అదే!

By Bojja Kumar

హైదరాబాద్: ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే కొన్ని ఫస్ట్ లుక్ టీజర్లు విడుదల చేసారు. రేపు(అక్టోబర్ 10) రాజమౌళి పుట్టినరోజును పురస్కరించుకుని మరో స్పెషల్ టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలుగు సినిమా చరిత్రలో ‘బాహుబలి' ఒక ప్రత్యేక సినిమా నిలబోతోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు లేనంత భారీ బడ్జెట్ ఈచిత్రానికి కేటాయించారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ సెట్టింగులు ఇలా...అన్నింటిలోనూ భారీ తనం ప్రదర్శిస్తున్న ‘బాహుబలి' చిత్రంలో మరో భారీ ప్రత్యేక కూడా ఉంది. ఈ చిత్రం షూటింగ్ కోసం 100 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సినిమాలో ఈ విగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. అందు వల్లే ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని షూటింగు కోసం రెడీ చేసారు.

Baahubali New Teaser on Oct 10?

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తలిసారి. ఈ విగ్రహం బరువు పదుల టన్నుల్లో ఉంటుందని అంచనా. బాహుబలి ఫస్ట్ పార్ట్ 2015లో ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నాలతో పాటు రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రానా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట.

ఆర్కా మీడియావర్క్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, పోరాట సన్నివేశాలతో ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X