బాహుబలి: ఇక ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన రాజమౌళి
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. దాదాపు సంవత్సర కాలంగా షూటింగ్ ప్రక్రియ సాగుతూనే ఉంది. సినిమాను ఎలాగైన ఏప్రిల్ 2015 నాటికి ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించుకున్న రాజమౌళి....స్పీడు పెంచారు.
మొత్తం పూర్తయ్యే వరకు నాన్ స్టాప్‌గా ఎక్కడా ఆపకుండా షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మేరకు యూనిట్ సభ్యులందరినీ అప్రమత్తం చేసారు. షూటింగ్ పూర్తయ్యే వరకు ఎవరూ ఎలాంటి ఇతర పనులు పెట్టుకోకూడదని సీరియస్‌గా చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్‌ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్.


Click it and Unblock the Notifications











