»   » గ్రాండ్‌గా ఉంది: ‘బాహుబలి’ అఫీషియల్ ట్రైలర్ (వీడియో)

గ్రాండ్‌గా ఉంది: ‘బాహుబలి’ అఫీషియల్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బాహుబలి' మూవీ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. 2 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ ఇప్పటికే థియేటర్లలో విడుదల కాగా, తాజాగా ఇంటర్నెట్లో సాయంత్రం 5 గంటలకు విడుదల చేసారు.

అబ్బురపరుస్తున్న ‘బాహుబలి' సెట్స్ (ఫోటోస్).భారతీయ సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉండబోతోందనడానికి ఈ ట్రైలర్ సాక్షంగా నిలుస్తోంది. కళ్లు చెదిరే భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన టేకింగ్....భారీ హంగులతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేసింది. బాహుబలి ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.


‘బాహుబలి' చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని ‘బాహుబలి ది బిగినింగ్' పేరుతో విడుదల చేయబోతున్నారు. కొన్ని నెలల గ్యాప్ తర్వాత బాహుబలి పార్ట్-2 విడుదల చేయనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, ప్రభాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Baahubali Official Trailer

‘బాహుబలి' పార్ట్-1 షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. జులైలో సినిమా విడుదల కానుంది. సినిమా నిడివి 2.32 గంటలు ఉంటుందని రాజమౌళి స్పష్టం చేసారు. అదే విధంగా బాహుబలి పార్ట్-2 షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలిపారు.

English summary
Watch Baahubali Official Trailer. Starring Prabhas, Anushka Shetty, Rana Daggubati, Tamannaah Bhatia, Sudeep and others.
Please Wait while comments are loading...