»   »  'బాహుబలి ' వివాదం రేపిన పాటకే రికార్డ్

'బాహుబలి ' వివాదం రేపిన పాటకే రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి ది బిగినింగ్' లో పచ్చబోట్టేసినా..అందగాడా నీతో అనే పాట వినే ఉంటారు. ఈ పాట ఇప్పుడు రికార్డ్ ను సాదించింది. అదేమిటంటే ఈ సాంగ్ యుట్యూబ్ ద్వారా ఇప్పటి వరకు సుమారు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. మిగతా సైట్స్ ను కూడా కలుపుకుంటే 1.4 కోట్ల వ్యూలు నమోదు అయినట్టే. తెలుగు సినిమాలలో ఇప్పటి వరకు ఎక్కువ మంది చూసిన వీడియోగా ఇది రికార్డ్ సాదించింది.

వాస్తవానికి ఈ పాట ఓ వివాదానికి కూడా దారి తీసింది. ఈ సినిమా రిలీజ్ అయినపుడు కొన్ని స్వచ్చంద సంస్థలు కలిసి ఈ సినిమాలో ప్రబాస్ తమన్నాను ఒకరకమైన స్థితిలోకి పంపుతాడు, అదికూడా రేప్ లాంటిదే అని వాదించారు. కాని అది నిలబడలేదు. తమన్నా నటించిన ఈ పాట యుట్యాబ్ లో ఇప్పటికి హల్ చెల్ చేస్తోంది.


సినిమాలో యువతకు నచ్చిన రొమాంటిక్ సీన్ ఏదంటే..... శివుడు, అవంతిక మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశం. ఆపై వచ్చే పచ్చబొట్టేసిన సాంగ్. అయితే ఈ సీన్‌పై మహిళా జర్నలిస్టు అన్నా వెట్టికాడ్ రాసిన వ్యాసం ఇపుడు చర్చనీయాంశం అయింది.


‘Baahubali’ Pacha Bottesina Song record

‘ది రేప్ ఆఫ్ అవంతిక' పేరుతో ప్రముఖ ఆంగ్లపత్రికలో రాసిన ఆ వ్యాసంలో ఆమె దర్శకుడు ఆ సీన్‌ను మలిచిన తీరును తప్పుబట్టారు. అవంతిక అనుమతి లేకుండా దొంగచాటుగా పచ్చబొట్టు వేయడం, అవంతిక అనుమ‌తి లేకుండా ఆమె జుట్టు ముడివిప్పి... ఆమె వ‌స్ర్తాలు తొల‌గించి...అడవిలో దొరికే సహజ రంగులతో ఆమెకు లిప్ స్టిక్ అద్దడం, కాటుక పెట్టడంపై విమర్శలు గుప్పించారు.


శివుడి పాత్ర అవంతిక పాత్ర పూర్తిగా తప్పుగా ప్రవర్తించింది. బాహుబలి లాంటి అద్భుతమైన విజువల్స్, పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాలో ఓ అపరిచితుడు, ఓ అమ్మాయిని ఇలా చేసి...ఆమెను ముగ్గులో దించి ప్రేమ‌లో ప‌డేయ‌డం చూస్తే యువ‌త‌కు ఎలాంటి సందేశం ఇచ్చిన‌ట్ల‌వుతుద‌ని ఆమె త‌న వ్యాసంలో ప్ర‌శ్నించారు.

English summary
Pacha Bottesina Song in ‘Baahubali’ - The Beginning had touched One Crore views in a Single Youtube Channel.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu