»   » బాహుబలి పార్ట్-2 గురించి వెల్లడించిన రాజమౌళి

బాహుబలి పార్ట్-2 గురించి వెల్లడించిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని ‘బాహుబలి ది బిగినింగ్' పేరుతో విడుదల చేయబోతున్నారు. కొన్ని నెలల గ్యాప్ తర్వాత బాహుబలి పార్ట్-2 విడుదల చేయనున్నారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ‘బాహుబలి పార్ట్-2' కు సంబంధించిన విషయాలు వెల్లడించారు రాజమౌళి.

‘బాహుబలి' పార్ట్-1 షూటింగ్ పూర్తయిందని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. సినిమా నిడివి 2.32 నిమిషాలు ఉంటుందని రాజమౌళి స్పష్టం చేసారు. అదే విధంగా బాహుబలి పార్ట్-2 షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలిపారు. సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాజమౌళి థాంక్స్ తెలిపారు.


Baahubali part-2 details

ఈ నెల 31న బాహుబలి ఆడియో వేడుక చేయాలనుకున్నామని, అయితే సెక్యూరిటీ కారణాల వల్ల పోలీసుల నుండి అనుమతి లభించలేదు. అందుకే ఆడియో వేడుక వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా జరిగినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అని తెలిపారు.


బాహుబలి ఆడియో వేడుక మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే వెల్లడిస్తాం. అంత వరకు అభిమానులు కాస్త ఓపిక పట్టాలి అని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.

English summary
First part of the Baahubali movie run time is about 2hrs 35minutes and 20% post production work is yet to be finished while 70% of the second part shooting is complete.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu