»   » ‘బాహుబలి’ పార్ట్ 2 షూటింగ్ డేట్ ప్రకటించిన ప్రభాస్

‘బాహుబలి’ పార్ట్ 2 షూటింగ్ డేట్ ప్రకటించిన ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' పార్ట్ -2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై హీరో ప్రభాస్ స్పష్టత ఇచ్చారు. షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతుందని తెలిపారు. పార్ట్ 2కు సంబంధించి షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది, యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో సెకండ్ పార్ట్ రాబోతోంది. 2016లో ఈ సినిమా విడుదల కానుంది.

గత రెండేళ్లుగా బాహుబలి షూటింగుకే పరిమితమైన ప్రభాస్ ప్రస్తుతం యూరఫ్ వెళ్లి తన స్నేహితులతో కలిసి రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి' సినిమా కోసం గత రెండు మూడేళ్లుగా ప్రభాస్ పడిన కష్టం మాటల్లో చెప్పడం కష్టమే. సినిమా కోసం కఠినమైన ఆహార నియమాలు, కఠినమైన వ్యాయామం, కత్తి యుద్ధం, కొండలు ఎక్కడం లాంటి విషయాల్లో అత్యంత కఠినతరమైన శిక్షణ. మొత్తానికి ‘బాహుబలి' సినిమా కోసం ప్రభాస్ పడిన కష్టానికి తగిన ఫలితమే దక్కింది. సినిమా సూపర్ హిట్టయింది. బాక్సాఫీసు వద్ద వందల కోట్లు కొల్లగొడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


Baahubali part 2 shooting details

త్వరలో మళ్లీ ‘బాహుబలి' పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఈ గ్యాపులో కాస్త రిలాక్స్ అవ్వాలని నిర్ణయించుకున్న ప్రభాస్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే స్కూల్ ప్రెండ్స్, కాలేజీ స్నేహితులతో కలిసి యూరఫ్ ట్రిప్ ప్లాన్ చేసారు. అంతా కలిసి కొన్ని రోజుల పాటు యూరఫ్‌లో ఎంజాయ్ చేసేందుకు బయల్దేరి వెళ్లారు.

English summary
Prabhas, who plays the titular role in Baahubali, has finally decided to go on a much deserved holiday and will resume the film's shooting in September 15.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu