»   » లీక్: బాహుబలి పార్ట్-2 స్టోరీ ఇదే అంటూ ప్రచారం..

లీక్: బాహుబలి పార్ట్-2 స్టోరీ ఇదే అంటూ ప్రచారం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్' ఇటీవలే విడుదలై బాక్పాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి భాగంలో సగం సినిమానే చూపించిన రాజమౌళి మిగతాది 2016లో ‘బాహుబలి' పార్ట్-2లో చూపిస్తామంటూ ప్రేక్షకుల్లో ఉత్కంఠకు తెరలేపాడు. కాగా...‘బాహుబలి-2' స్టోరీ లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. లీకైన స్టోరీ ఇలా ఉంది...

అమరేంద్ర బాహుబలి(ప్రభాస్), భల్లాలదేవ(రానా) ఇద్దరూ దేవసేన(అనుష్క)ను ప్రేమిస్తారు. కానీ దేవసేన అమరేంద్ర బాహుబలిని ఇష్టపడుతుంది. తన ప్రేమ కోసం బాహుబలి రాజ్యాధికారం నుండి తప్పుకున్న బాహుబలి దేవసేనను పెళ్లాడి సంతోషంగా జీవితం గడుపుతుంటాడు.


Baahubali part 2 story leaked?

అయితే మహిష్మతి రాజ్యాధికారం చేపట్టిన భల్లాలదేవ(రానా) ప్రజలను తన బానిసలుగా చూస్తాడు. అతని పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడతారు. ఇదే సమయంలో కాలకేయుడి సోదరుడు(చరణ్ రాజ్) మహిష్మతి రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు. రాజ్యాన్ని కాపాడటానికి అమరేంద్ర బాహుబలి రంగంలోకి దిగుతాడు. ఇదే క్రమంలో భల్లాలదేవ, బిజ్జల దేవ(నాజర్) కుట్ర చేసి కట్టప్ప(సత్యరాజ్)తో బాహుబలిని చంపిస్తాడు. అదే సమయంలో దేవసేన పండండి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను చంపాలని భటులను ఆదేశిస్తాడు భల్లాలదేవ.


శివగామి(రమ్యకృష్ణ) ఆ పిల్లాడిని వారిని నుండి తప్పించడం, ఆ పిల్లాడు కొండజాతి వారి వద్దకు చేరడం, శివుడుగా ఎదగడం, తమన్నాను ప్రేమించడం, ఈ క్రమంలో తన గతం గురించి తెలుసుకోవడం మొదటి భాగంలో చూపించారు. శివుడు తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిన భల్లాలదేవుడిపై పగ తీర్చుకోవడం, అతని పాలనలో నరకం అనుభవిస్తున్న ప్రజలను విముక్తి కలిగించడం, రాజ్యాధికారం చేపట్టడం, తమన్నాను తన పట్టపురాణిగా చేసుకోవడం సెకండ్ పార్టులో చూపిస్తారట. మరి ఈ స్టోరీ నిజమైందో? లేక కల్పితమో తేలాల్సి ఉంది.

English summary
SS Rajamouli’s Baahubali is receiving huge appreciations from everyone. Now, all are eagerly waiting to watch Baahubali part 2. Here is the story of Baahubali part 2.
Please Wait while comments are loading...