బాహుబలి సారంగ్, ఐఐటి మద్రాస్ కల్చరల్ ఫెస్ట్

By Bojja Kumar

బాహుబలి : ఇండియాలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటి మద్రాస్ నిర్వహించే ప్రతిష్టాత్మ 40వ ఎడిషన్ ‘సారంగ్' కల్చరల్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి' మూవీ భాగం కాబోతోంది. జనవరి 7 నుండి 11 వరకు ఈ ఫెస్ట్ జరుగుతుంది. సారంగ్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించే ఫిల్మ్‌ఫెస్ట్ ‘బాహుబలి' టీం స్పాన్సర్ చేస్తోంది. సారంగ్ ఫెస్టివల్ 4వ రోజు ఈ ఫిల్మ్ ఫెస్ట్ జరుగుతుంది. ఈ ఫిల్మ్ ఫెస్ట్ లో పలువురు ఔత్సాహికులకు తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం కల్పిస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Baahubali participates in Saarang, IIT Madras's Prestigious Cultural Fest

ఆర్కా మీడియా బేనర్లో ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. 2015 వేసవిలో తొలి భాగం వస్తుందని అంటున్నారు. ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఈ చిత్రం తెలుగు ప్రాంతానికో, ఇండియాకో పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగిన విధంగానే చిత్రీకరణ జరుగుతోంది.

ప్రభాస్, అనుష్క, దగ్గుబాటి రానా, తమన్నా, రమ్యక్రిష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్, కథ: వి.విజయేంద్రప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: ఎం.రత్నం, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X