»   » గిన్నీస్ రికార్డ్ కోసం: ‘బాహుబలి’ ఇలా (వీడియో)

గిన్నీస్ రికార్డ్ కోసం: ‘బాహుబలి’ ఇలా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ‘బాహుబలి' చిత్రం గిన్నీస్ బుక్ కు ఎక్కనుందా..అవుననే వినపడుతోంది. ఈచిత్రం శనివారం సాయంత్రం కొచ్చిలో మళయాల ఆడియో ఆవిష్కరణ జరగనుంది. ఈ ఆడియో వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది. అది బాహుబలి మళయాల ఆడియో రిలీజ్ వేడుకలో ఓ సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పేందుకు బాహుబలి టీమ్ సిద్ధమైంది. అదేంటో ఇక్కడ మీరు చూడండి.

Baahubali World Record Poster

World's biggest poster for India's biggest motion picture #Baahubali | Watch video


Posted by BaahubaliMalayalam on 27 June 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా ఆవిష్కరించనంత సైజులో అతిపెద్ద పోస్టర్‌ను ఆవిష్కరించి వరల్డ్ రికార్డు నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ ఆర్గనైజర్స్ ఈ పోస్టర్ ని గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం పంపనున్నారు.


రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు బాహుబలి యూనిట్ ఇప్పటికే కొచ్చిలో పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలతో ముచ్చటిస్తూ మళయాలం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇక జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో బాహుబలి భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే.


'Baahubali' poster to get the Guinness Book of World Records

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.


అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని
, చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.


'Baahubali' poster to get the Guinness Book of World Records

ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.


అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.

English summary
Baahubali’s organizers will send the poster to get the Guinness Book of World Records’ recognition. Prior to the audio launch, the entire cast and crew of Baahubali interacted with the media and revealed the details about the making of the film.
Please Wait while comments are loading...